నవ్వులు పూయించారు: లోకసభలో తెలంగాణ ఎంపీ, కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఓ పార్లమెంటుసభ్యుడికి, కేంద్రమంత్రికి జరిగిన సంభాషన గురువారం జరిగిన లోకసభలో నవ్వులు పూయించాయి. ఆ వివరాల్లోకి వెళితే.. లోక్‌స‌భ‌లో ఇవాళ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో న‌వ్వులు పూశాయి. దేశంలో నెల‌కొన్న నీటి స‌మ‌స్యపై వేసిన ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ స‌మాధానం ఇచ్చారు.

ఆ స‌మ‌యంలో తెలంగాణ ఎంపీ ఒక‌రు మిష‌న్ భ‌గీర‌థ‌కు అద‌న‌పు నిధులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. ఆ ఎంపీ మాట్లాడుతున్న స‌మ‌యంలో కేంద్ర మంత్రి కొంత అస్వ‌స్థ‌తగా క‌నిపించారు.

TRS MP Jithendra Reddy Seeks More Funds For Mission Bhagiratha

దీంతో 'మంత్రి గారు ఇవాళ చాలా డ‌ల్‌గా ఉన్నారు' అంటూ ఆ ఎంపీ ఛమత్కారంగా అన్నారు. ఆ ఎంపీ చేసిన వ్యాక్యలకు మంత్రి వెంట‌నే స్పందించారు. ఎవ‌రైనా డ‌బ్బులు అడిగితే, తాను డ‌ల్‌గా మారుతాన‌ని మంత్రి స‌మాధానం ఇచ్చారు. దీంతో స‌భ‌లో న‌వ్వులు చిగురించాయి.

ఆ తర్వాత మిషన్ భాగీరతకు కావాల్సిన అదనపు నిధుల విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తుందని తెలిపారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిసన్ భాగీరథ పథకాన్ని ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+