వరంగల్ సభ ఖర్చుల కోసం ‘గులాబీ కూలీ’లుగా మారిన కేకే, తలసాని!
వరంగల్ టీఆర్ఎస్ సభ ఖర్చుల కోసం మంగళవారం ఏంపీ కేశవరావు, మంత్రి తలసాని చెమటోడ్చారు. ఇద్దరూ కలిసి ‘గులాబీ కూలీ’ కార్యక్రమం ద్వారా రూ.8 లక్షలు సంపాదించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులకు 'గులాబీ కూలీ' ద్వారా బాగానే గిట్టుబాటు అవుతోంది. మంగళవారం పార్టీ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావు(కేకే) 'గులాబీ కూలీ'గా మారారు. సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యార్థులకు పాఠాలు బోధించి ఆయన రూ.2 లక్షలు సంపాదించారు.
అలాగే నోవా ఇంజనీరింగ్ కళాశాలలో బోధనా మెలకువలు చెప్పడం ద్వారా మరో రూ.2 లక్షలు సంపాదించారు. దీంతో పాటు, ఒహ్రిస్ హోటల్ లో తెలంగాణ బ్రాండ్ ఐస్ క్రీమ్ ను విక్రయించి ఇంకో రూ.2 లక్షలు సంపాదించారు. మొత్తంమీద 'గులాబీ కూలీ'గా కేశవరావు రూ.6 లక్షలు సంపాదించారు.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో 'గులాబీ కూలీ'గా పని చేసి రూ.2 లక్షల 16 వేలు సంపాదించారు.
ఈ నెల 27న వరంగల్ లో టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఖర్చుల నిమిత్తం పార్టీకి చెందిన పలువురు నేతలు, నాయకులు 'గులాబీ కూలీ'లుగా మారుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications