కిషన్ రెడ్డి ఓ నికృష్టపు మంత్రి.. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు : కవిత
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీకి తాకట్టుపెట్టారని విమర్శించారు. వారి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని దుయ్యబట్టారు.

కిషన్ రెడ్డి తెలంగాణలో పుట్టడం సిగ్గుచేటు
బీజేపీ నేతల తీరును తెలంగాణ సమాజం చీదరించుకుంటుందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వారు తిరిగితే ప్రజలు తరిమికొట్టే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నామని దుయ్యబట్టారు. ఆయన రాష్ట్రానికి తీసుకువచ్చిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదని విమర్శించారు.

నికృష్ణపు కేంద్ర మంత్రి
కిషన్ రెడ్డి ఓ నిస్సహాయ, నికృష్ణ కేంద్ర మంత్రి అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి.. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు పనికిరాదు.. స్టీల్ ప్యాక్టరీ రాదు అంటున్నారని ద్వజమెత్తారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ .. తెలంగాణ హక్కు అని ఆమె పేర్కొన్నారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు ఉందని , నిల్వలు ఉన్నాయని జియోలజికల్ సర్వే ఆప్ ఇండియా నివేదిక కూడా ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు.
Recommended Video

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసన
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఖండిస్తూ రేపు నిరసనకు చేపట్టనున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బయ్యారం ఉక్కు ప్యాక్టరీ సాధన ఆందోళన చేపడతామని చెప్పారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన కార్యక్రమం ఉటుందని వెల్లడించారు. బయ్యారం స్టీల్ ప్యాక్టరీకి విషయంలో కేంద్రానికి ఉక్కు సంకల్పం కాదు.. అది తుక్కు సంకల్పమని ఎద్దేవా చేశారు. ఉక్కు ప్యాక్టరీ వస్తే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications