వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణను శత్రువులా చూస్తారా.. ఎందుకీ వివక్ష? : టీఆర్ఎస్ ఎంపీలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణను కేంద్రం శత్రువుగా చూస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. కానీ, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.

 తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

విభజన చట్టంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదని టీఆర్ఎస్ ఎంపీలు దుయ్యబట్టారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎంపీలు కీలక వ్యాఖ్యల చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరల్ సిస్టమ్‌ను కేంద్రం దగా చేస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కే. కేశవరావులు మండిపడ్డారు.

 ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా సహాయం చేయలేదు..

ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా సహాయం చేయలేదు..

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా సహాయం చేయలేదని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు తెలంగాణపై విరోధం పెంచుకుంటున్నారని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన రూ. 450 కోట్ల బకాయిలు ఇంత వరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. ఉపాధి కల్పనకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు విడుదల చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

Telangana Govt విధానాలపై మండిపడ్డ Osmania University Student Dayakar | Oneindia Telugu
 వరి ధాన్యం సేకరణలో జాతీయ విధానం..

వరి ధాన్యం సేకరణలో జాతీయ విధానం..


కేంద్రంలో మెజార్టీ ఉందని రాజ్యాంగ సంస్థల‌ను బీజేపీ ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు నామా, కేకే ఆరోపించారు . ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రివిలేజ్ కమిటీని కూడా కేంద్రం ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్‌ను కేంద్రం నిరాకరించడంతో.. అనేక రాష్ట్రాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వరి ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలని కోరారు.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఉపాధి కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు..

English summary
TRS MPs Nama, KK fire on centra govt in all party meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X