హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన నాగోల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క ఘర్షణ జరగలేదని, ఎవ్వరిని ఇక్కడ నుంచి పంపించలేదన్నారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాల వారు మరోసారి ప్రజలను గందరగోళం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధికి బాటలు వేసే పార్టీలను గెలిపించాలని పిలుపు నిచ్చారు. గతంలోనే కాదు భవిష్యత్‌లో కూడా హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చన్నారు.

విపక్ష నేతల తప్పుడు ప్రచారాలని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, నిరంతర విద్యుత్, నీటిఎద్దడి నివారణకు చేపడుతున్న ప్రణాళికలు, స్కైవేల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను గురించి మంత్రి వివరించారు.

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్


అనంతరం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు వరంగల్‌లో పట్టిన గతే పడుతుందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల గడువు పెరగడం టీఆర్‌ఎస్‌కు అనుకూలమన్నారు.

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్


సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని మిగతా రాష్ర్టాలు, దేశాలు కొనియాడుతున్నాయన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్


సీఎం పేదల పక్షపాతిగా నిలబడ్డారని, నగరంలో కారు జోరు ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నగరంలో గురువారం ఉదయం నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించి, గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.

 హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్


రానున్న ఎన్నికల్లో అభివృద్ధి చేసేవాళ్లను ఎన్నుకోవాలన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 50 ఏళ్ల చలనచిత్ర రంగంలో కార్మికుల సమస్యలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ప్రాంతాలకతీతంగా కార్మికులకు ఇళ్లను నిర్మించి అందిస్తామన్నారు.

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్


మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో రోడ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.1900 కోట్ల నిధులతో ప్రణాళికలను రూపొందించి వేగవంతంగా పనులను చేపట్టిందన్నారు.

 హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్

హైదరాబాద్‌లో అందరూ హాయిగా జీవించవచ్చు: కేటీఆర్


కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాల్‌కిషన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పురాణం సతీష్, మంథని ఎమ్మెల్యే పుట్టమధు, రామగుండం ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందనరావు, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

English summary
TRS Party meeting at LB Nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X