రేవూరి ప్రకాష్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణలకు టిఆర్ఎస్ గాలం?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:రేవంత్‌రెడ్డి వెంట వెళ్ళకుండా టిడిపిలోనే ఉన్న నేతలపై టిఆర్ఎస్ కేంద్రీకరించింది.ప్రధానంగా వరంగల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణపై టిఆర్ఎస్‌ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. వీరిద్దరిని తమ పార్టీలోకి ఆహ్వనించేందుకు కీలక నేతలను రంగంలోకి దించిందనే ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతల్లో సీతక్క టిడిపిని వీడారు. రేవంత్‌ వెంట ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.భూపాలపల్లి నియోజకవర్గానికి టిడిపి నేత గండ్ర సత్యనారాయణరావు ఇంచార్జీగా ఉన్నారు. నర్సంపేటకు చెందిన రేవూరి ప్రకాష్‌రెడ్డిలపై టిఆర్ఎస్‌ నేతలు కేంద్రీకరించారు.

TRS plans to invite Revuri Prakash Reddy and Gandra Satyanarayana rao

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు నేతలు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది.దీంతో ఈ నేతలపై టిఆర్ఎస్‌ కేంద్రీకరించింది. టిఆర్ఎస్‌లో చేరితే ఆఫర్లు ఇస్తామని టిఆర్ఎస్ హమీ ఇస్తోందని ప్రచారం సాగుతోంది.

టిడిపి జాతీయప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఉన్నారు. రేవంత్‌రెడ్డితో పాటు రేవూరి ప్రకాష్‌రెడ్డి కూడ టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే రేవూరి ఖండించారు. రేవంత్‌ వెంట రేవూరి ప్రకాష్‌రెడ్డి వెళ్ళలేదు. అయితే టిఆర్ఎస్‌ నేతలు మాత్రం రేవూరిని తమ పార్టీలోకి ఆహ్వనించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డిని టార్గెట్‌ చేసి పార్టీలోకి ఆహ్వానించేందుకు సీనియర్‌ మంత్రి, ఎమ్మెల్యేలు రేవూరితో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది.

నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీతో పాటుగా భవిష్యత్‌లో మంత్రి పదవి ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ఆఫర్‌ చేసినట్టు ప్రచారం సాగుతోంది.మరో వైపు కాంగ్రెస్ నేతలు కూడ రేవూరిని సంప్రదించినట్టు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి నేతలు కూడ రేవూరి ప్రకాష్‌రెడ్డిని తమ పార్టీల్లోకి ఆహ్వనాలు పంపారని సమాచారం. రేవూరిని పార్టీలోకి తీసుకొంటే నర్సంపేట టిఆర్ఎస్ ఇంచార్జీగా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. మరో వైపు గండ్రసత్యనారాయణరావుపై కూడ టిఆర్ఎస్ నేతలు కేంద్రీకరించారనే ప్రచారం సాగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a spreading a rumour Trs leaders discussed with TDP national general secretary Revuri prakash Reddy. They planning to invite Revuri prakash Reddy and Gandra Satyanarayana rao to join TRS.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి