మోడీ వ్యాఖ్యలపై మిన్నంటిన నిరసనలు; టీఆర్ఎస్ నాయకుల బైక్ ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని, వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకొని సీఎం మోడీ ఏ విధంగా అయితే రైతులకు క్షమాపణ చెప్పారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రం పై వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మోడీ వ్యాఖ్యలపై భగ్గుమన్న టీఆర్ఎస్ శ్రేణులు, ఆందోళనల పర్వం
ఇదిలా ఉంటే ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. భారీ ఎత్తున మోడీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీలు చేస్తున్నారు. మోడీ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేస్తున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టిఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ వైఖరిని నిరసిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేసి, బిజెపి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యసభలో ప్రధాని మోడీ తెలంగాణ అమరవీరుల బలిదానాలను అపహాస్యం చేశారని మండిపడ్డారు. మోడీ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోడీ అండ్ కంపెనీ ఆటలు సాగవని హెచ్చరించారు. బిజెపి కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఆందోళనలు
ఇదిలా ఉంటే మోడీ వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఆగ్రహజ్వాలలు మిన్నుముట్టాయి. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద నల్లజెండాలతో నిరసన తెలుపుతూ బిజెపి పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోనూ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు.

మంచిర్యాలలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బాల్క సుమన్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ ఇది వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ఐబీ చౌరస్తాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఎమ్మెల్యే బాల్క సుమన్. నల్లబ్యాడ్జీలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి బీజేపీపై మండిపడ్డారు.

మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
ప్రధాని నరేంద్ర మోడీ బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందేనని తేల్చి చెబుతున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. బిజెపి తన తీరు మార్చుకోకపోతే గ్రామాలలో తిరిగి ఇవ్వమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న మోడీ సర్కార్ కు తగిన గుణపాఠం చెబుతామని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని తేల్చి చెప్పారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications