హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలు: మేయర్‌ని డిసైడ్ చేసేది కేటీఆరే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లకు ఎన్నికల నగారా మోగడంతో టికెట్ల పందేరం మరింత రసవత్తరంగా మారింది. టికెట్ల కోసం పోటీపడుతున్న వారిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉండటంతో నిరసన సెగలకు ఆజ్యం పోస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అవిర్భావం నుంచి పనిచేస్తున్న వారిని కాదని, ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు ఎమ్మెల్యేలు తమ అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో పాత, కొత్త ఆశావహుల్లోంచి అభ్యర్థిని ఖరారు చేయడం టీఆర్ఎస్ పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఒక్కో డివిజన్ నుంచి 10మంది వరకు పోటీపడుతుండటం నేతలకు తలనొప్పిగా మారింది. దీంతో అభ్యర్ధి ఆర్థిక స్థితి, గెలుపు అవకాశాలే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది.

TRS ready for civic body poll in Warangal, Khammam

దీంతో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలు మోసినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇన్నాళ్లు పార్టీనే నమ్ముకున్న క్యాడర్‌కు ఇప్పుడు గ్రేటర్‌ ఎన్నికల్లో టికెట్‌ వస్తుందా రాదా? అనే టెన్షన్ పట్టుకుంది.
టీఆర్ఎస్ పార్టీ ఆవి ర్భావం నాటి నుంచి పార్టీ జెండాను, కండువాను మోసిన క్యాడర్‌కు వలసవాదులు పెద్ద తలనొప్పిగా మారారు.

ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ గూటికి ఇతర పార్టీల నుంచి తరలివచ్చిన వారి నుంచి పెను సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో పది డివిజన్లలో పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవనుంది. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించకుండా ఉన్న వారికి టిక్కెట్లు ఇవ్వాలంటూ పార్టీలోని ముగ్గురు కీలక వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తుండడంతో తలపట్టుకుంటున్నారు.

వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 58 డివిజన్లు ఉండగా, పరకాల, స్టేషన ఘనపూర్‌, వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్ల పంపిణీ టెన్షన్ పట్టుకుంది. వరంగల్‌ తూర్పు పరిధిలోని అండర్‌ రైల్వేగేట్‌ డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

మొదటి నుంచీ ఉన్న నాయకులకు పోటీగా, ఒకటి రెండు సంవత్సరాల క్రితం పార్టీలోకి వచ్చిన వారు టికెట్ల కోసం లాబీయింగ్‌ చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నేతలు, ఇటీవల జరిగిన ఉపఎన్నికలో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన వారికి టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 42 గ్రామాల విలీనంతో గ్రేటర్‌స్థాయికి ఎదిగి 58 డివిజన్లుగా ఏర్పడ్డాయి. మొత్తం గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్లలో సామాజికవర్గాల వారీగా ఎస్టీలకు 2, ఎస్సీలకు 9, బీసీలకు 19, జనరల్ మహిళలకు 15, జనరల్ కేటగిరీలో 13 డివిజన్లను కేటాయించారు. ఇందులో 50 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్‌చేశారు.

KTR

దీంతో గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్లలో 29 డివిజన్లు మహిళలకు ఖరారయ్యాయి. గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లను కైవసం చేసుకోవటం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించాలని టీఆర్‌ఎస్‌ ప్రణాళిక రచిస్తోంది. వరంగల్ మేయర్ జనరల్ అవుతుందన్న సమచారం ఉండటంతో ఈ సీటు హాట్ కేక్‌గా మారింది.

మేయర్ పదవి కోసం ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తన తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మరోవైపు మొదటినుంచి గ్రేటర్ పీఠంపై ఆశలుపెట్టుకున్న టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ కూడా రేసులో ఉన్నారు.

మరోవైపు గతంలో నరేందర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారనే వాదన వినిపిస్తోంది. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు కూడా మేయర్ సీటుపై కన్నేశారు. అయితే వరంగల్ గ్రేటర్ ఎన్నికలను సారధ్య బాధ్యతలను తెలంగాణ ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీసుకోవడంతో ఆయన ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారికే మేయర్ పీఠం దక్కుతుందనే పార్టీ శ్రేణులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X