వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చమురు మంటల్లో బీజేపి కాలిపోతుందన్న టీఆర్ఎస్.!కరెంటు షాక్ తో టీఆర్ఎస్ మసైపోతుందన్నబీజేపీ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం బీజేపి వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టు రాజకీయాలు వాడివేడిగా ముందుకెళ్తున్నాయి. పెరిగిన వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గులాబీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా, పెరగబోతున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కమలం నేతలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీంతో పెంట్రోల్ మంటల్లో కమలం కాలిపోతుందని టీఆర్ఎస్ నేతలు అంటుండగా, కరెంట్ షాక్ తగిలి గులాబీ నేతలు మాడిపోతారని బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 బీజేపి టీఆర్ఎస్ పరస్పర యుద్దం.. బస్తీమే సవాల్ అంటున్న ఇరు పార్టీలు

బీజేపి టీఆర్ఎస్ పరస్పర యుద్దం.. బస్తీమే సవాల్ అంటున్న ఇరు పార్టీలు

ప్రజలను అనేక ఇబ్బంది పెడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ , బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని, దేశం నుంచి తరిమికొట్టేవరకు బీజేపీకి బుద్దిరాదని గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రో,డీజిల్, గ్యాస్ ధరల పెంపు దారుణమని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతూ గత ఎనిమిదేండ్లుగా ప్రజలను హింసించి 23 లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నారని గులాబీ నేతలు ఘాటు విమర్శలు చేసారు. అన్ని వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని, చమురు ధరలు తగ్గించేంత వరకు ఉద్యమం ఆగదని గులాబీ నేతలు బీజేపి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 పెట్రో,డీజిల్, గ్యాస్ ధరల పెంపు దారుణం.. తగ్గించేంత వరకు పోరాడతామన్న టీఆర్ఎస్

పెట్రో,డీజిల్, గ్యాస్ ధరల పెంపు దారుణం.. తగ్గించేంత వరకు పోరాడతామన్న టీఆర్ఎస్

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన లు చేయాలని టీఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా గురువారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలను గులాబీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పాలకులు
పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు రెట్టింపు చేసి ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయన్నారు. ఎన్నికలైన వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతారని సీఎం చంద్రశేఖర్ రావు ఆనాడే చెప్పారని వెల్లడించారు.

 టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది.. అందుకే విద్యుత్ చార్జీలను పెంచిందన్న బీజేపి

టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది.. అందుకే విద్యుత్ చార్జీలను పెంచిందన్న బీజేపి

ఇదిలా ఉండగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని, కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంట్ ఛార్జీల పెంపుతో మోయలేని భారాన్ని మోపిందని బీజేపి మండిపడుతోంది. ఛార్జీల రూపంలో పేదల నడ్డి విరుస్తోందని, కరెంట్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమని, పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతగాని సీఎం చంద్రశేఖర్ రావు ఫ్రభుత్వం ఆ భారాన్ని సామాన్యులపై మోపడం అన్యాయమని బీజేపి అభివర్ణిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన 48 వేల కోట్ల రూపాయల బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవం, అట్లాగే డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్‌ బకాయిలు 17 వేల కోట్ల రూపాయలుండగా అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే 12,598 కోట్లు ఉండటం దారుణమంటోంది బీజేపి.

 పాత బస్తీలో బిల్లులు వసూలు చేసే సత్తా ఉందా.? సూటిగా ప్రశ్నించిన బండి సంజయ్

పాత బస్తీలో బిల్లులు వసూలు చేసే సత్తా ఉందా.? సూటిగా ప్రశ్నించిన బండి సంజయ్

అంతే కాకుండా వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు 4603 కోట్ల రూపాయల కాగా, అందులో అత్యధికంగా పాతబస్తీకి చెందినవేనని బీజేపి అంటోంది. ప్రభుత్వం ఒకవైపు తన శాఖలు వాడుకున్న కరెంట్ కు బిల్లులు చెల్లించడం లేదని, మరోవైపు పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము లేదని, కానీ ఈ లోటును పూడ్చుకునేందుకు సామాన్య ప్రజలపై ఛార్జీల పెంపు పేరుతో భారం మోపడం ఎంత వరకు సమంజసమని బీజేపీ సూటిగా ప్రశ్నిస్తోంది. క‌రెంట్ ఛార్జీలు త‌గ్గించేవ‌ర‌కు బీజేపీ పోరాడుతుందని, అందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క‌రెంటు ఛార్జీల పెంపుపై ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేపడుతున్నామని బండి సంజయ్ తెలిపారు. పేద‌ల‌ నుండి మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా ఛార్జీల పెంపుతో క‌రెంటు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి త్వరలోనే ప్రజలు షాక్ ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్ ఓ ప్రకటనలో తెలిపారు.

English summary
Lotus leaders have called for protests across the state, demanding a reduction in rising electricity tariffs, while rose leaders have embarked on large-scale protests demanding a reduction in rising cooking gas and diesel petrol prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X