Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొడంగల్: ఆ రెండు పార్టీల నేతలపై టిఆర్ఎస్ వల, రేవంత్‌కు చిక్కులేనా?

రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహలు రచిస్తోంది. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కలుస్తున్నారు.

కొడంగల్: రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహలు రచిస్తోంది. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కలుస్తున్నారు. అయితే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ అనుచరులపై ప్రత్యేకంగా కేంద్రీకరించిన టిఆర్ఎస్ తమ పార్టీలోకి ఆహ్వనించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ నేతలతో రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు.

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులపై టిఆర్ఎస్ కేంద్రీకరించింది. రేవంత్‌రెడ్డి వెంట నడిచిన నేతలను టిఆర్ఎస్ తమ వైపుకు లాక్కొంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలపై కూడ టిఆర్ఎస్ కేంద్రీకరించింది.

ఉపఎన్నికలు జరిగితే ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్‌ను దెబ్బకొట్టాలని టిఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.టిడిపికి రాజీనామా చేసి రేవంత్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో రేవంత్‌రెడ్డి అనుచరులను టిఆర్ఎస్ కేంద్రీకరించింది.

 కాంగ్రెస్ నేతలతో రేవంత్ సమావేశం

కాంగ్రెస్ నేతలతో రేవంత్ సమావేశం

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలతో రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఇప్పటివరకు టిడిపిలో ఉన్నంత కాలం రేవంత్‌ వెంట ముఖ్య నాయకులు కొందరు కాంగ్రెస్‌పార్టీలో చేరలేదు. టిఆర్ఎస్‌లో చేరారు. ఈ నియోజకవర్గంపై అధికారపార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు కేంద్రీకరించి పనిచేస్తున్నారు.కొడంగల్ నియోజకవర్గంలో కీలకమైన గ్రామానికి చెందిన నాయకుడిని టిఆర్ఎస్‌లో చేర్చుకొనేలా టిఆర్ఎస్ వ్యూహరచన చేసింది.

 కాంగ్రెస్‌ పార్టీకి సలీం రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి సలీం రాజీనామా

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పై కూడ టిఆర్ఎస్ దృష్టి సారించింది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించిన జిల్లా అధికార ప్రతినిధి సలీం పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. తనతో పాటు ముఖ్యమైన నేతలను కూడా కారెక్కించేశారు. ఈ తరుణంలోనే రేవంత్‌రెడ్డి కోస్గిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

 టిడిపి నేతలంతా టిఆర్ఎస్‌లో

టిడిపి నేతలంతా టిఆర్ఎస్‌లో

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీకి చెందిన ముఖ్యమైన వారందరూ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.రేవంత్‌ వెంట నడిచిన కొందరు ముఖ్యులపై టిఆర్ఎస్ కేంద్రీకరించి మరీ టిఆర్ఎస్‌ పార్టీలో చేరేలా వ్యూహన్ని రచించింది. టిఆర్ఎస్ వ్యూహం ప్రకారంగా టిఆర్ఎస్‌లో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కొందరు కీలకనేతలు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. ఉప ఎన్నికలైనా, 2019 ఎన్నికలైనా ఈ నియోజకవర్గం నుండి రేవంత్‌రెడ్డిని ఓడించాలనే వ్యూహంతో టిఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తోంది.

 కొడంగల్‌పైనే టిఆర్ఎస్ దృష్టి

కొడంగల్‌పైనే టిఆర్ఎస్ దృష్టి

టిఆర్ఎస్ నాయకత్వం ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించింది.టిడిపి ద్వితీయశ్రేణినాయకులను పార్టీలో చేర్చుకొన్న మీదట ప్రస్తుతం కాంగ్రెస్ నేతలపై టిఆర్ఎస్ కేంద్రీకరించింది. ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నేతలను టిఆర్ఎస్‌ వైపు మళ్ళించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+