పొరుగు రాష్ట్రంలో మన జెండా ఎగరాలి -నాకు రాజకీయం ఒక టాస్క్ : కేసీఆర్..!!
జాతీయ పార్టీ ప్రకటన వేళ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ టీఆర్ఎస్ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. సరిగ్గా 1.19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసారు. ఈ సమావేశానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో పాటుగా తమిళనాడు నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో అమలు చేస్తన్న పథకాలను ప్రస్తావించిన కుమార స్వామి వాటిని ప్రశంసించారు. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలని ఆకాంక్షించారు.

రైతు సంక్షేమమే అజెండాగా
కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడిగా అభివర్ణించారు. బీఆర్ఎస్ సక్సెస్ కావాలని తాను కోరుకుంటున్నట్లుగా కుమార స్వామి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రాజకీయం ఒక టాస్క్ అని ప్రకటించారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసారు. రైతు సంక్షేమమే ప్రధాన ఏజెండాగా తన పార్టీ ముందుకు వెళ్తుందని స్పష్టం చేసారు. ఇంత ఆహార భద్రత ఉన్న రాష్ట్రంలో పాసింగ్ ఫుడ్ పైన ఆధారపడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి ప్రాసెసింగ్ ఫుడ్ దిగుమతి చేసుకోవడం దారుణమన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో విస్తరిద్దాం
తమ పార్టీ తొలి అడుగులు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర -కర్ణాటకలో కార్యాచరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. అక్కడి రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్రయత్నం చేద్దామని వివరించారు. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టిఆర్ఎస్ మీ రాష్ట్రానికి పరిమితం చేస్తే ఎలా అని చాలామంది అడిగారని చెప్పిన కేసీఆర్..దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ అని స్పష్టం చేసారు. జాతీయ పార్టీగా గుర్తింపులో ఖరారు సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా పార్టీ కొనసాగింపుకు అవాంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గులాబీ రంగు జెండా- కారు గుర్తు కొనసాగుతాయని పార్టీ నేతలు వెల్లడించారు. ములాయం అనారోగ్యంతో ఉండటంతో అఖిలేష్ ను వద్దని చెప్పానని..త్వరలోనే అందరూ వస్తారని చెప్పారు.

ఎన్నికల సంఘం ఆమోదం కోసం
తీర్మానంలో ఆమోదించిన విధంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఆమోదించిన తీర్మానం కాపీనీ ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఢిల్లీలో ఇప్పటికే సర్ధార్ పటేల్ రోడ్‌లో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న జోధ్‌పూర్ రాజ వంశీయుల బంగ్లాను లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. వసంత్ విహార్‌లో 2021 సెప్టెంబర్ 2న పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయగా 1200 చదరపు మీటర్ల విస్తర్ణంలో భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇక, ఇప్పుడు కేసీఆర్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ పైన స్పష్టత ఇవ్వనున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications