హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు 106 సీట్లు, పనితీరు బాగా లేకపోతే టిక్కెట్లు రద్దు

వచ్చే ఎన్నికల్లో 154 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ కు 101 నుండి 106 స్థానాల్లో విజయం సాధిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమాను వ్యక్తం చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:వచ్చే ఎన్నికల్లో 154 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ కు 101 నుండి 106 స్థానాల్లో విజయం సాధిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమాను వ్యక్తం చేశారు.

శుక్రవారం నాడు టిఆర్ఎస్ భవనంలో నిర్వహించిన పార్టీ శాసనసభపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఎంఏల్ఏల పనితీరుపై సర్వే నివేదికను ముఖ్యమంత్రి ఇచ్చారు. ఈ నివేదికలను బట్టి పనితీరును మార్చుకోవాలని ఎంఏల్ఏలకు కెసిఆర్ సూచించారు.

వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగి 154 స్థానాలకు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ కు 101 నుండి 106 స్థానాల్లో విజయం సాధిస్తోందని కెసిఆర్ చెప్పారు. ఈ మేరకు సర్వే ఫలితాలను ఆయన పార్టీ శాసనసభపక్ష సమావేశంలో ప్రకటించారు.

trs will win 106 seats in next elections

అయితే మెజారిటీ శాసనసభ్యుల పనితీరు సరిగా లేదని ఈ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు నిరాకరిస్తామని సిఎం తేల్చిచెప్పారు. మంచి పనితీరును కనబర్చిన ఎంఏల్ఏలను ఆయన అభినందించారు.

ఖమ్మం జిల్లాలో సగటున ఎంఏల్ఏ ల పనితీరు 48 శాతంగా ఉందని కెసిఆర్ సర్వే నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.అయితే ఖమ్మం జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న తుమ్మలకు 63 శాతంతో అగ్రస్థానంలో నిలిచారు. కాని, ఇదే జిల్లాకు చెందిన వైరా ఎంఏల్ఏ కు మాత్రం కేవలం 38 శాతం మాత్రమే ప్రజల నుండి మద్దతు లభించింది.

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పనితీరులో 53 శాతానికి పడిపోయారు.ఇదే జిల్లాకు చెందిన ఎమ్మేల్యేలు రేఖానాయక్, బాబురావు, దివాకర్ రావులు 30 నుండి 40 శాతం లోపుగానే ప్రజల మద్దతు లభించింది.
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మేల్యేల పనితీరుపై సమీక్ష సాగుతోంది.

English summary
trs will win 106 seats in next elections said cm kcr,he addressed in party legislature meeting on friday.he ordered to party mlas, and mlcs should attend assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X