80సీట్లు మనవే: కేసీఆర్, విద్యార్థి విభాగానికి 3ఎమ్మెల్యే, 1ఎమ్మెల్సీ సీటు కేటాయింపు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 70 నుంచి 80 సీట్లు గెలుపొందుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు అన్నారు. కష్టపడి పనిచేస్తే.. ఈ సీట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అన్నారు.

టీఆర్‌ఎస్‌ అనుబంధ విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్వీ) సమావేశం మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్‌.. టీఆర్‌ఎస్వీ భవిష్యత్‌ కార్యాచరణ, సభ్యత్వ నమోదు అంశాలపై చర్చించారు.

పార్టీ విద్యార్థి విభాగం.. సైన్యంలా పనిచేసి టీఆర్ఎస్‌ విజయానికి కృషి చేయాలని కేసీఆర్‌ సూచించారు. టీఆర్‌ఎస్వీ శిక్షణా తరగతులు ముగిశాక.. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశముందని తెలిపారు. వి

విద్యార్థి విభాగానికి ఓ ఎమ్మెల్సీ పదవితోపాటు.. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగాక.. మూడు ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాల్లో విద్యార్థి విభాగం శ్రేణుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ

టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీని కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ 67 మందితో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. వీరిలో ఒకరు రాజ్యసభ సభ్యులు కే కేశవరావు సెక్రెటరీ జనరల్ కాగా.. 20 మంది ప్రధాన కార్యదర్శులుగాను 33 మంది కార్యదర్శులుగాను, 12 మంది సహాయ కార్యదర్శులుగాను నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శిగా శేరి సుభాష్ రెడ్డినే కొనసాగించనున్నారు.

రాష్ట్ర కార్యవర్గం వివరాలిలా ఉన్నాయి:

సెక్రటరీ జనరల్ : కె. కేశవరావు (రాజ్యసభ సభ్యులు)

ప్రధాన కార్యదర్శులు
ప్రొ. శ్రీనివాస్ రెడ్డి (ఎమ్మెల్సీ), తుల ఉమ (జెడ్పీ ఛైర్మన్), బస్వరాజు సారయ్య (మాజీ మంత్రి), తక్కళ్లపల్లి రవీందర్ రావు , యండీ ఫరీదుద్దీన్ (ఎమ్మెల్సీ), డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), డా. బండా ప్రకాశ్ ముదిరాజ్, వి. గంగాధర్ గౌడ్ (ఎమ్మెల్సీ), జె. సంతోష్ కుమార్ , నారదాసు లక్ష్మణ్ రావు (ఎమ్మెల్సీ), డా. పి రాములు (మాజీ మంత్రి),
ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, చాగళ్ల నరేంద్రనాథ్ , నూకల నరేష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు (ఛైర్మన్, టీఎస్ఐఐసీ), మైనంపల్లి హనుమంతరావు (ఎమ్మెల్సీ), సోమ భరత్ కుమార్ గుప్తా, బండి రమేష్, సత్యవతి రాథోడ్ (మాజీ ఎమ్మెల్యే), బి. వెంకటేశ్వర్లు (ఎమ్మెల్సీ).
33మంది కార్యదర్శలు, 12మంది సహాయ కార్యదర్శులను ఎంపకి చేయడం జరిగింది

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM K Chandrasekhar Rao on Tuesday said that TRS party will win 80 seats in next assembly elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి