హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మినీ పురపోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీల్లో గులాబీ తిరుగులేని విజయాలను నమోదు చేసింది. టీఆర్ఎస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ఆ పార్టీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

గ్రేటర్ వరంగల్ కొర్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం

గ్రేటర్ వరంగల్ కొర్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్:

మొత్తం 66 డివిజన్లకు ఎన్నికలు జరుగ్గా..
టీఆర్ఎస్ పార్టీ 48 డివిజన్లలో గెలిచింది
బీజేపీ 10 డివిజన్లలో గెలిచింది.
కాంగ్రెస్ 4 స్థానాలను దక్కించుకోగా, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.

ఖమ్మం కార్పొరేషన్‌ను చేజిక్కించుకున్న గులాబీ పార్టీ

ఖమ్మం కార్పొరేషన్‌ను చేజిక్కించుకున్న గులాబీ పార్టీ

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి.

43 డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపొందింది
కాంగ్రెస్ పార్టీ 9, బీజేపీ 1, ఇతరులు 7 డివిజన్లలో విజయాలను నమోదు చేశారు.

Recommended Video

Telangana Municipal Elections : కరోనా నిబంధనలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్...!!
ఐదు మున్సిపాలిటీల్లో సత్తా చాటిన టీఆర్ఎస్

ఐదు మున్సిపాలిటీల్లో సత్తా చాటిన టీఆర్ఎస్

సిద్దిపేట మున్సిపాలిటీ:

సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డుల‌ు
టీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో విజ‌య‌కేత‌నం
ఒక వార్డులో బీజేపీ గెల‌వ‌గా, మిగ‌తా ఐదు వార్డుల్లో ఇత‌రులు గెలుపొందారు.

అచ్చంపేట మున్సిపాలిటీ:
అచ్చంపేట మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 20 వార్డులు
13 స్థానాల్లో టీఆర్ఎస్
6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.

జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ
జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 27 వార్డుల‌ు
టీఆర్‌ఎస్ 23 వార్డుల్లో విజయం సాధించింది.
ఇక కాంగ్రెస్‌ పార్టీ రెండు, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది.
కాగా, జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.

కొత్తూరు మున్సిపాలిటీ:
రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీ మొత్తం 12 వార్డులు
7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని గులాబీ జెండాను ఎగుర‌వేసింది.
ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలుపొందారు.

న‌కిరేక‌ల్ మున్సిపాలిటీ:
న‌కిరేక‌ల్ మున్సిపాలిటీకి జ‌రిగిన ఎన్నికల ఫలితాలు వెల్ల‌డ‌య్యాయి. మొత్తం 20 వార్డుల‌కు గాను 12 వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.
కాంగ్రెస్ 2, ఇతరులు 6 వార్డుల్లో గెలిచారు.

English summary
trs won khammam and warangal corporations and five municipalities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X