హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో కొత్త సంస్థ సర్వే.. ఆ పార్టీకి ఊహించని షాక్!! 35 స్థానాలు అత్యంత క్లిష్టం??

|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్రాలు స‌ర్వేల‌తో హోరెత్తుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఆయా పార్టీలు త‌మ బ‌ల‌బ‌లాల‌ను తేల్చుకునేందుకు ఇప్ప‌టినుంచే సిద్ధమ‌వుతుండ‌టంతో ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. ఏపీలో వైసీపీకి ఐప్యాక్‌తోపాటు ఢిల్లీకి చెందిన ఒక ఏజెన్సీ, మ‌రో రెండు సంస్థ‌లు స‌ర్వేలు నిర్వ‌హిస్తూ నివేదిక‌లు అంద‌జేస్తున్నాయి. జాతీయ మీడియా కూడా త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. తెలంగాణ‌లో ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేతోపాటు వివిధ సంస్థ‌లు నిర్వ‌హించిన ఫ‌లితాలు వెలుగు చూస్తున్నాయి.

టీఆర్ఎస్ బలం తగ్గుతోంది

టీఆర్ఎస్ బలం తగ్గుతోంది


తాజాగా టీఎస్-119 పేరుతో ఓ సంస్థ సర్వే చేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంతో పోలిస్తే అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితి బ‌లం త‌గ్గిన‌ట్లు స‌ర్వే సంస్థ‌ల‌న్నీ పేర్కొంటున్నాయి. కానీ ఈ సంస్థ స‌ర్వేలో ఏ పార్టీకి ఆధిక్యం ల‌భిస్తుందో వెల్ల‌డించారుకానీ ఎవ‌రు అధికారాన్ని చేజిక్కించుకుంటార‌నే విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోగ‌లుగుతుంది? మొద‌టి మూడు స్థానాలు ఎవ‌రివి? ఎన్ని సీట్ల‌లో హోరాహోరీ పోరు న‌డుస్తుంది? త‌దిత‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది.

35 స్థానాల్లో హోరాహోరీ

35 స్థానాల్లో హోరాహోరీ


ప్ర‌స్తుత స‌ర్వే ప్ర‌కారం టీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది. ఆ పార్టీకి 35 స్థానాలు సులువుగా వ‌స్తాయ‌ని చెప్పింది. కానీ ఎన్నికలు జ‌రిగే స‌మ‌యానికి వీటిల్లో మార్పు ఉంటుంద‌ని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 22 స్థానాల్లో విజ‌యం సాధించే అవకాశాలున్నాయని, బీజేపీకి 18 స్థానాల్లో అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొంది. ఎం‌ఐ‌ఎం పార్టీకి 7, ఇతరులు 2 స్థానాలు గెలుచుకుంటార‌ని తెలిపింది. 35 స్థానాల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు న‌డుస్తుంద‌ని, వీటీల్లో ఎక్కువ సీట్లలో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ మధ్యే గ‌ట్టి పోరు న‌డుస్తుంద‌ని స‌ర్వే సంస్థ తెలిపింది.

 బలమైన నాయకులు లేకపోవడమే మైనస్?

బలమైన నాయకులు లేకపోవడమే మైనస్?


ఏ సంస్థ స‌ర్వే చేసినా మొద‌టి, రెండు స్థానాల్లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్ నిలుస్తున్నాయి. ఎలాగైనా తెలంగాణ‌లో పాగా వేయాల‌నే ధృడ‌నిశ్చ‌యంతో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీకి నిరాశ త‌ప్ప‌డంలేదు. ప్ర‌తి స‌ర్వే సంస్థ ఆ పార్టీకి మూడోస్థానాన్ని కేటాయిస్తోంది. పై రెండు పార్టీల‌కు క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల బలం ఉండ‌టం, బూత్ ల‌వారీగా స‌భ్య‌లు ఉండ‌టం బ‌లాన్నిస్తోంది. బీజేపీకి నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోవడం మైన‌స్‌గా మారుతోంది. ఎన్నిక‌లు జ‌రిగే స‌మాయాన్ని ఈ అడ్డంకుల‌న్నీ ఆ పార్టీ ఎలా అధిగ‌మిస్తుందో చూడాలి.!!

English summary
It seems that a company named TS-119 has recently conducted a survey.All survey organizations claim that the strength of the ruling Telangana State Committee has decreased compared to the past.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X