Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Telangana DOST 2021: డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ -ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాలివే..

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఆయా యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కుగానూ దోస్త్ 2021-22 అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన ఉన్నత విద్యా మండలి మంగళవారం ప్రకటన చేసింది. అప్లికేషన్ తేదీలు, ఫీజులు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..

డిగ్రీ చదివేందుకు అర్హ‌త క‌లిగిన విద్యార్థులు జులై 1 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థులు జులై 3 నుంచి 16వ తేదీ వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్స్ ఇచ్చుకోవ‌చ్చు. జులై 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23వ తేదీ నుంచి జులై 27వ తేదీ వ‌ర‌కు సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

TS DOST 2021 notification for UG admissions issued, registration to begin on July 1

బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఉస్మానియా, కాక‌తీయ‌, తెలంగాణ‌, మ‌హాత్మాగాంధీ, పాల‌మూరు, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ సింగిల్ విండో సేవలు అందించనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 200 చెల్లిస్తే దోస్త్ ఐడీ వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 105 దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్‌లున్నాయి. ఇదిలా ఉంటే,

డిగ్రీలో ప్రవేశాల కోసం జులై 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా, అదే రోజు నుంచి కేజీ టు పీజీ ఆన్‌లైన్ తరగతులు మొదలుకానున్నాయి. ఆ మేరకు ఈనెల 25 నుంచే టీచర్లందరూ స్కూళ్లకు వెళ్తున్నారు. నిజానికి జులై 1 నుంచి ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభించాలని సర్కారు భావించినా, కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా తరగతులను ఆన్‌లైన్ లోనే నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో విద్యా శాఖ ఆమేరకు ప్రకటన చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+