సోమేశ్ కుమార్‌కు హైకోర్టులో షాక్: క్యాడర్ కేటాయింపు రద్దు, ఏపీకి వెళ్లాలంటూ తీర్పు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్యాడర్ కేటాయింపు వివాదంపై ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. అప్పీలుకు వెళ్లేందుకు తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని సోమేశ్ కుమార్ తరపు న్యాయవాది అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏపీకి వెళ్లిపోవాలంటూ స్పష్టం చేసింది.

రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లోనే కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. తాజాగా మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, దేశంలో సుదీర్ఘం గా కొనసాగుతున్న సీఎస్‌లో సోమేశ్ కుమార్ ఒకరిగా ఉన్నారు. రెవెన్యూ, ఆబ్కారీ, వాణిజ్యపన్నులు, స్టాంపులు-
రిజిస్ట్రే షన్లు, భూపరిపాలన కమిషనర్ వంటి కీలక పోస్టులనూ ఆయనే నిర్వ హిస్తున్నారు. భూ రికార్డుల కంప్యూటరీకరణకు ఉద్దేశిం చిన ధరణి వెబ్సైట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. 2023 డిసెంబరు 31 వరకు సోమేశ్ పదవీకాలం ఉంది. అయితే, తాజాగా హైకోర్టు తీర్పుతో తదుపరి కార్యాచరణ ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications