హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ నిఖిల్ రెడ్డి కాళ్లు కోసిన గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్‌కు నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శస్త్రచికిత్స ద్వారా ఎత్తు పెంచడదానికి టెక్కీ నిఖిల్ రెడ్డి కాళ్లు కోసిన హైదాబాదులోని గ్లోబల్ ఆస్పత్రికి తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి బుధవారం నోటీసు జారీ చేసింది. ఆ సంఘటనపై వివరణ ఇవ్వాలని మండలి ఆదేశించింది.

TS Medical Council serves notice given to Global Hospitals

ఓ యువకుడికి ఆ సర్జరీ ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంపై వివరణ ఇవ్వాలని గ్లోబల్ ఆస్పత్రి వైద్యుడికి సమన్లు జారీ చేసినట్లు మండలి చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి చెప్పారు. సర్జరీకి ప్రాతిపదిక ఏమిటి, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎలా సర్జరీ చేశారని మండలి అడిగింది.

కాసుల కోసం నిఖిల్ కాళ్లు కోశారు: ఆపరేషన్ ఇలా, సంక్లిష్ట ప్రక్రియ (పిక్చర్స్) కాసుల కోసం నిఖిల్ కాళ్లు కోశారు: ఆపరేషన్ ఇలా, సంక్లిష్ట ప్రక్రియ (పిక్చర్స్)

ఈ సంఘటనను రోగి ప్రయోజనాల దృష్ట్యా, ఆస్పత్రి నైతికత దృష్ట్యా పరిశీలించనున్నట్లు రవీందర్ రెడ్డి చెప్పారు. అక్రమ అపెండిక్స్, హిస్టెరెక్టమీ ఆపరేషన్లు చేసినట్లు ఆరోపణలు రావడంతో మండలి అధికారులు మార్చి 30వ తేదీన కరీంనగర్ ఆస్పత్రిలో తనిఖీలు చేశారు.

TS Medical Council serves notice given to Global Hospitals

సర్జరీకి చెందిన అన్ని రికార్డులతో తమ ముందుకు రావాలని డాక్టర్ కె. సురేష్‌ను ఆదేశించినట్లు రవీందర్ రెడ్డి చెప్పారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని, వైద్యుల నిర్లక్ష్యం ఉంటే కేసులు నమోదు చేయాలని తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్య మండలిని ఆదేశించినట్లు సమాచారం.

English summary
The TS Medical Council served a notice to Global Hospitals on Wednesday demanding explanation regarding the recent limb lengthening and reconstruction surgery it carried out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X