వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకాకుళంలో 40 వేల మోటర్లుకు మీటర్లు.. జగన్ నోరెందుకు మెదపడం లేదు ? : ఏపీ సీఎంకు హరీశ్‌ సూటి ప్రశ్న‌

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేగుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు ఇచ్చే ఎరువులపై కూడా సబ్బిడీని తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ల కోసమే బీజేపీ పనిచేస్తోందని .. పేదలను పట్టించుకున్న పాపాన పోవడంలేదని దుయ్యబట్టారు

శ్రీకాకుళంలో 40 వేల మోటర్లకు మీటర్లు

శ్రీకాకుళంలో 40 వేల మోటర్లకు మీటర్లు

.
దేశంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లను బిగించేందుకు మోదీ ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తుందని హరీశ్ రావు విమర్శించారు. రైతులను దగా చేసేందుకు అడుగడుగునా కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తేనే రాష్ట్రాలకు కేంద్రం రాయితీలు ఇస్తోందన్నారు. కేంద్రం తెచ్చిన ఈ విద్యుత్ సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 40 వేల మోటర్లకు మీటర్లు పెట్టారని పేర్కొన్నారు. దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 విద్యుత్ సంస్కరణపై జగన్ స్పందించ‌రా?

విద్యుత్ సంస్కరణపై జగన్ స్పందించ‌రా?

అటు అంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణపై జగన్ ఎందుకు నోరు మెదడం లేదని ప్రశ్నించారు. తమ మెడపై కత్తిపెట్టినా వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి తెగేసి చెప్పారని తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

 తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం

తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం

తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం నిదులు, ప్రాజెక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని మండిప‌డ్డారు. యూపీలో బీజేపీకి ఓటు వేయకపోతే ఓటర్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్ అనడం వారి ఆహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని హరీశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అతిగతిలేని పార్టీ అని విమర్శించారు..

English summary
Telangana minister Harish rao interesting comments on AP CM Jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X