తెలంగాణను నెంబర్ 1 చేసింది అందులోనే: బీఆర్ఎస్ సర్కారుపై ప్రియాంక గాంధీ విమర్శలు

వరంగల్: ప్రజలకు మేలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చే సమయం ఆన్నమైందని.. ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడిందన్నారు ప్రియాంక గాంధీ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అమరులు ఆకాంక్షలు నెరవేరాయా? అని ప్రశ్నించారు. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని నిలదీశారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని అన్నారు. ఉద్యోగ పరీక్షల్లో కుంభకోణాలు జరిగాయని, పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్నారు.

TS Polls: priyanka gandhi hits out at brs govt in palakurthi and husnabad election campaign

ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడిందని ప్రియాంక మండిపడ్డారు. అసలు ఆ యువతి దరఖాస్తు చేసుకోలేదని చెప్పారన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయని ప్రియాంక చెప్పారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేసి.. పేపర్ లీకేజీలను అరికాడతామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి మహిళ ఖాతాలో రూ. 2500 వేస్తామన్నారు ప్రియాంక గాంధీ. గ్యాస్ సిలిండర్ రూ. 500కే ఇస్తామని చెప్పారు. అంతేగాక, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా ఉందన్నారు. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందన్నారు.


పదేళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహంకారంతో విర్రవీగుతున్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఈ ప్రభుత్వాల పాలనలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ గాలి జోరుగా వీస్తోందన్నారు. తెలంగాణలో దొరల పాలనను కూల్చి ప్రజల పాలనను కాంగ్రెస్​ తీసుకువస్తోందన్నారు ప్రియాంక గాంధీ.

మరోవైపు, హుస్నాబాద్ కాంగ్రెస్ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనతో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా? అని నిలదీశారు. నిరుద్యోగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ పేద ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+