TS RTC: రాఖీ పండుగ లక్కీ డ్రా విజేతలకు నగదు బహుమతి అందజేసిన టీఎస్ఆర్టీసీ..

సెప్టెంబర్ 8వ తేదీ శుక్రవారం ఎంజిబిఎస్ బస్టాండ్‌లో జరిగిన రక్షా బంధన్ లక్కీ డ్రా బహుమతి పంపిణీ కార్యక్రమంలో 33 మంది మహిళలు నగదు బహుమతులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఈ డ్రాను నిర్వహించింది. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజేతలకు బహుమతులను అందజేశారు.

"రక్షా బంధన్ లక్కీ డ్రా చొరవకు అద్భుతమైన స్పందన లభించింది. సుమారు 3 లక్షల మంది మహిళా ప్రయాణికులు పాల్గొన్నారు. బహుమతులు గెలుచుకున్న మహిళలు విభిన్న నేపథ్యాలు, జీవన రంగాలకు చెందినవారు. అయితే వీరంతా గత కొన్నేళ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు" అని సజ్జనార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకునే వారి కోసం ప్రతి సంవత్సరం దసరా, సంక్రాంతి, ఉగాది పండుగల సందర్భంగా ఇలాంటి లక్కీ డ్రా ఈవెంట్‌లను నిర్వహించాలని కార్పొరేషన్ నిర్ణయించింది.

TS RTC awarded cash prizes to lucky draw winners of Rakhi festival

రక్షా బంధన్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 30, 31 తేదీల్లో మహిళా ఆర్టీసీ ప్రయాణికులకు లక్కీ డ్రా నిర్వహించారు. మొదటి బహుమతికి రూ.25వేలు, రెండో బహుమతికి రూ.15వేలు, తృతీయ బహుమతికి రూ.10వేలు నగదు పురస్కారం అందజేశారు. కాగా ఈ సారి రాఖీ పండుగకు ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.ఆగస్టు 31న రూ. 22.65 కోట్ల ఆదాయం వ‌చ్చింది. ఆర్టీసీ చ‌రిత్ర‌లో ఇదే ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. గ‌తేడాది రాఖీ పండుగ రోజున రూ. 21.66 కోట్ల ఆదాయం వ‌చ్చింది. ఈ సారి రూ. కోటి వ‌ర‌కు అద‌నంగా ఆదాయం వచ్చింది.

ఆగస్టు 30న తెలంగాణ వ్యాప్తంగా 9 వేల బస్సులు నడపగా.. రూ.18.25 కోట్ల ఆదాయం వచ్చింది. రాఖీ పండుగ రోజు 40.91 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించారు. గ‌తేడాదితో పోల్చితే అద‌నంగా ల‌క్ష మంది రాక‌పోక‌లు సాగించారు. ఆక్యుపెన్సీ రేషియో విష‌యంలో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా గ‌తేడాది రికార్డును అధిగ‌మించింది. గ‌తేడాది రాఖీ పండుగ నాడు 101.01 ఆక్యుపెన్సీ సాధించ‌గా, ఈ ఏడాది 104.68 శాతం న‌మోదు చేసింది.

వ‌రంగ‌ల్ జిల్లాలో 97.05 శాతం, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్, మెద‌క్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో న‌మోదైంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలకు రద్దీ ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్ కరీంనగర్, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నల్గొండ, హైదరాబాద్ నిజామాబాద్ రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+