TSRTC: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ.. హైదరాబాద్, బెంగళూరు మధ్య లహరి, గరుడ బస్సులు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది. హైదరాబాద్, కర్ణాటక మధ్య కొత్త బస్సులను ప్రవేశపెట్టింది. TSRTC కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బల్లి, దావణగెరె, హైదరాబాద్ మధ్య కొత్త లహరి AC స్లీపర్, గరుడ ప్లస్ బస్సులను నడుపుతోంది. టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ప్రతి గంటకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10:45 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

హుబ్బళ్లి నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు సాయంత్రం 6, 9 గంటలకు, హైదరాబాద్ నుంచి హుబ్బళ్లి బస్సులు రాత్రి 8, 7 గంటలకు బయలుదేరుతాయని చెప్పారు. దావణగెరె నుంచి హైదరాబాద్ బస్సు సాయంత్రం 5 గంటలకు, హైదరాబాద్ నుంచి దావణగెరె నుంచి సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ సేవలను వినియోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థకు సహకరించాలని వీసీ సజ్జనార్ కోరారు.

 garuda
అంతకు ముందు కూడా ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. టీ-24 టికెట్ ధర ఇది వరకు రూ. 100 ఉండగా.. ప్రస్తుతం రూ. 90 చేసింది. ఇదే టికెట్ వృద్ధులకు రూ. 80కే అందించనున్నారు. సీనియర్ సిటిజన్లు వయస్సు ధృవీకరణ కోసం ఆధార్‌ను కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ఆయన చెప్పారు.

ఈ టికెట్ కొన్నవారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటలపాటు ఎక్కడ్నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మహిళలు, వృద్ధుల కోసం టీ-6 టికెట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. రూ. 50 టికెట్ కొన్నవారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రయాణించవచ్చని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం ఎఫ్-24 అనే టికెట్ ను తెచ్చామని ఆయన తెలిపారు.

రూ. 300 టికెట్ తీసుకుంటే 24 గంటలపాటు నలుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చని వివరించారు. హైదరాబాద్ నగర పరిధిలో తీసుకువచ్చిన టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లు కొని క్షేమంగా, సురక్షితంగా, సంతోషంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+