TS weather: తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారి, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా పయనించే అవకాశం ఉంది. అలాగే, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది.

మరోవైవైపు, పశ్చిమ భారతదేశం నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

TS Weather update: Two more days heavy rains in few districts in Telangana.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇది ఇలావుండగా, ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమయ్యాయి. ఇళ్లల్లోకి వ‌ర‌ద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలు, గాలుల కారణంగా ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. 87 ఏళ్ల త‌ర్వాత 55.5 సెం.మీ. అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

కాగా, కేంద్ర‌ప‌డ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గోడ కూలి ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ఒడిశాలో పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌ ఏడు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ జారీ చేయ‌గా, ఆరు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్, 8 జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. వ‌చ్చే 24 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. ఒక‌టి నుంచి రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.ఇప్పటికే దేశ రాజధానిలో భారీ వర్సాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్లపైకి వరద రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+