TSPSC గ్రూప్-1 పేపర్ లీక్ వారికి ముందే తెలుసు..! ఎలా తెలిసిందంటే..!
ఎవరైనా తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తారు. టీఎస్పీఎస్సీ పేపర్ కేసులో కూడా ఇదే జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి.. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేశారు. గత ఏడాది అక్టోబర్ లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లీక్ చేశారు.
ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేశ్ గుర్తించారు. వీరు ప్రవీణ్, రాజశేఖర్ ను ప్రశ్నించారు. దీంతో వారు షమీమ్, రమేశ్ కు పేపర్ లీక్ చేశారు. డబ్బులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. షమీమ్, రమేశ్ నుంచే న్యూజిలాండ్ లోని రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డికి పేపర్ లీక్ చేశారు.

ఆ తర్వాత సైదాబాద్ కు చెందిన మరో వ్యక్తికి కూడా పేపర్ లీక్ చేశారు. వీరంతా కలిసి ఇంకా ఎంత మందికి పేపర్ లీక్ చేశారో సిట్ విచారిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100 మార్కులకు పైగా వచ్చిన వారికి కొంత మందికి సిట్ నోటీసులు ఇప్పిటికే జారీ చేయగా.. తాజాగా 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చినవారందరికీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
షమీమ్, రమేశ్ కాకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై కానీ టీఎస్పీఎస్సీలో పని చేసే వారిపై కూడా సిట్ దృష్టి సారించింది. మరోవైపు టీఎస్సీపీఎస్సీని రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉస్మానియాలోని ఆర్ట్స్ కాలేజి వద్ద ఏబీవీపీ ఆధ్వార్యంలో విద్యార్థులు నిరుద్యోగ దీక్ష చేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ వెంటనే రాజీమామా చేయాలని డిమాండ్ చేశాడు.












Click it and Unblock the Notifications