TSPSC: పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్.. సిట్ కస్టడీకి నిందితులు..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‍పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యానాయక్, రాజేశ్వర్ సిట్ కస్టడీలోకి తీసుకుంది. చంచల్ గూడ జైలు నుంచి నిందితులు పోలీసులకు సిట్ ఆఫీస్ కు తరలించారు. మార్చి 28 వరకు నిందితులు కస్టడీలో ఉంటారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న షమీమ్, రమేష్, సురేష్ కస్టడీని పొడగించారు.
టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ తో ఈ ఉదాంతం బయటకొచ్చింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్, పాటు వివిధ పరీక్షలను రద్దు చేశారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని సిట్ విచారించింది. పేపర్ లీక్ కేసులో కేటీఆర్ పీఏ పై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిని కూడా సిట్ విచారించింది.
బండి సంజయ్ కి కూడా సిట్ నోటీసులు పంపింది. సిట్ గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100 మార్కలకు పైగా వచ్చిన వారిని కూడా సిట్ విచారించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో ఓయూలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం బీజేపీ ఆధ్వర్యలో మహాధర్నా నిర్వహించారు.

ఈ కేసులో తాజాగా మరో వ్యక్తిని సిట్ అదుపులోకి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని నేరేళ్లచెరువు గ్రామానికి చెందిన రాజేంద్ర కుమార్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ.10 లక్షలు బేరం కుదుర్చుకున్నాడని, రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం పంచాంగల్ తండకు చెందిన డాక్య, పాటు సల్కర్‌పేట గ్రామానికి చెందిన తిరుపతయ్యలతో కలిసి రాజేంద్ర కుమార్ గతంలో గండేడ్ మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో కలిసి పని చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications