ఆధారాలు ఇవ్వలేదు: రేవంత్ రెడ్డిపై చర్యలకు సిట్ రెడీ!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్సీ) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల నోటీసులు ఇచ్చిన క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్ బృందం పేర్కొంది.

ఈ క్రమంలో నిరాధారమైన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. న్యాయపరమైన సలహాలు తీసుకుని రేవంత్ పై చర్యలు తీసుకునేందుకు సిట్ రెడీ అవుతోంది. ఒకే మండలంలో 100 మంది పాస్ అయినట్లుగా రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.

TSPSC Paper leakage case: SIT likely to take action on Revanth Reddy

ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.మార్చి 23న విచారణకు హాజరైన రేవంత్ తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్‌కు సమర్పించారు. రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సిట్ రికార్డు చేసింది.

మరోవైపు, సిట్ విచారణ అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకునే సిట్ విచారణకు హాజరైనట్లు తెలిపారు. ఆరోపణలు చేస్తున్న అందరికీ సిట్ నోటీసులు జారీ చేస్తోందని, అలా అయితే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలన్నారు.

TSPSC Paper leakage case: SIT likely to take action on Revanth Reddy

కేటీఆర్ వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని చెప్పారని, పూర్తి వివరాలు కేటీఆర్ వద్ద ఉన్నాయని సిట్ దర్యాప్తు అధికారి ఏఆర్ శ్రీనివాస్‌కు విచారణ సందర్భంగా చెప్పానన్నారు రేవంత్. నేరస్తులను విచారించకుండానే కేటీఆర్ పూర్తి సమాచారం చెప్పారని.. కేటీఆర్ నుంచి సిట్ అధికారులు ఎందుకు సమాచారాన్ని సేకరించలేదని రేవంత్ నిలదీశారు. మరోవైపు, టీఎస్ పీఎస్సీ వ్యవహారంపై ఆరోపణలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా సిట్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అయితే, తనకు ఎలాంటి నోటీసులు అందలేదని సంజయ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+