టీఎస్ఆర్టీసీ ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం: అధునాతన సౌకర్యాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) తొలిసారి ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించింది. వీటిలో ఉచిత వైఫై సౌకర్యం అందించడం విశేషం. 16 ఏసీ స్లీపర్ బస్సులకు మరెన్నో అధునాతన సౌకర్యాలను జోడించింది. ఈ ఏసీ స్లీపర్ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ ఎల్బీనగర్‌లో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల ప్రారంభించిన 12 నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే వీటికి 'లహరి-అమ్మఒడి అనుభూతి'గా ఆర్టీసీ నామకరణం చేసింది. ప్రయాణికులకు నేటి నుంచి ఈ బస్సులో అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, తమిళానాడులోని చెన్నై, కర్ణాటకలోని బెంగళూరు, హబ్బళ్లి మార్గాల్లో వీటిని నడపనున్నట్లు పేర్కొంది.

కాగా, ఈ బస్సుల్లో ప్రయాణికులకు కొత్త అనుభూతినిచ్చేలా అధునాతన సౌకర్యాలను కల్పించారు. ప్రయాణికుల భద్రత కోసం బస్సు ట్రాకింగ్ సిస్టమ్ తోపాటు బస్సులో పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సు లోపల సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేశారు.
ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 26, 2023
బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBuses pic.twitter.com/WBrFy37xmt
ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే ఫైర్ డిటెక్షన్ అప్రమత్తం చేస్తుంది. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది. 12 మీటర్ల పొడవుండే ఈ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15 కలిపి మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్తుకు కూడా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం, రీడింగ్ ల్యాంప్ ఉంటాయి. ఈ బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తుండటం విశేషం. గమ్యస్థానాల వివరాలు తెలిపేలా బస్సు ముందు, వెనక ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులుంటారు.












Click it and Unblock the Notifications