కెసిఆర్‌పై పోస్ట్: కండక్టర్‌పై విచారణకు ఆర్టీసీ ఆదేశం
తెలంగాణ సీఖం కెసిఆర్‌కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన కండక్టర్‌పై విచారణసోషల్ మీడియాలో ప్రభుత్వానికి కెసిఆర్‌కు వ్యతిరేకంగా పోస్ట్విచారణ చేయాలని విజిలెన్స్‌కు ఆర్‌టిసి లేఖ
హైదరాబాద్ : సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కించపర్చే విధంగా వ్యవహరించే వారిపై తెలంగాణలో చర్యలు మొదలయ్యాయి.ప్రభుత్వ పెద్దలను అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటించారు.
ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో విమర్శించినందుకు కండక్టర్ డి.సంజీవ్ కు నోటీసులు పంపించారు. ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రిని, ప్రజాప్రతినిధులను విమర్శిస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగానే తెలంగాణలో కూడా ఆ తంతు మొదలైంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆర్టీసీ సంస్థ అధికారులను విమర్శించారనే పేరిట డీ సంజీవ్ అనే బస్సు కండక్టర్‌కు నోటీసులు పంపించారు. నిజమాబాద్ డిపో 1లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఫేస్‌బుక్, వాట్సాప్ వేదికలుగా చేసుకొని కేసీఆర్‌ను, అధికారులను విమర్శిస్తున్నారని నోటీసులు పంపారు.
దీనిపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులకు కూడా ఆర్టీసీ ఫిర్యాదు చేసింది. విచారణ చేసి ఆ వివరాలు తమకు ఇవ్వాలని కూడా కోరింది.అయితే ఈ నోటీసులకు కండక్టర్ సంజీవ్ ఏం సమాధానం ఇస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.












Click it and Unblock the Notifications