ప్రయాణికులకు బిగ్‌ షాక్.. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు

ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున, 4వ స్టేజీ నుంచి రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఇ-ఆర్డినరీ, ఇ- ఎక్స్‌ ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమలు కానున్నాయని పేర్కొంది.

హైదరాబాద్‌ లో బస్సు ఛార్జీల పెంపుపై టీజీఎస్‌ ఆర్టీసీ పిడుగులాంటి వార్త తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సులకు ఛార్జీలు పెంచింది. మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున, 4వ స్టేజీ నుంచి రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఇ-ఆర్డినరీ, ఇ- ఎక్స్‌ ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమలు కానున్నాయని పేర్కొంది.

TSRTC Fare Fury Bus Tickets Set to Rise in Hyderabad and Secunderabad

మరోవైపు దసరా పండుగ టీజీఎస్ఆర్టీసీకి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. గడిచిన 10 రోజుల్లో ఆర్టీసీకి రూ.110 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది దసరా సందర్భంగా పది రోజులకు గానూ 5,300 స్పెషల్​ బస్సులను నడిపింది. గతేడాది దసరా పది రోజులూ 6,300 ప్రత్యేక బస్సులను నడిపించగా రూ.114 కోట్ల ఆదాయం వచ్చింది.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రాబోయే రెండేళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 25 డిపోలున్నాయి. అందులో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. ఈ ఏడాదిలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి.

ఒక్కో డిపోలో రూ.8 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో ఛార్జింగ్ కోసం హెచ్‌ టీ కనెక్షన్లను టీజీఎస్పీడీసీఎల్, ట్రాన్ కో ద్వారా నిర్మించింది. రాబోయే 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో ఛార్జింగ్ కోసం హెచ్‌ టీ కనెక్షన్లను సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే, ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా హైదరాబాద్ లో ప్రజా రవాణాను మరింతగా విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే, కొత్తగా 10 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మౌలిక సదుపాయాలకు రానున్న సంవత్సరంలో రూ.392 కోట్ల మేర వ్యయమవుతుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. టీజీఎస్ఆర్టీసీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక భారాన్ని మోయలేదు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+