TSRTC: మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ.. రూ.80 కు పట్నమంతా తిరగొచ్చు..
ప్రయాణికుల సంఖ్య పెంచుకునేందుకు టీఎస్ఆర్టీసీ కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా టీఎస్ఆర్టీసీ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు T24 టికెట్ రేట్లలో డిస్కౌంట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణించే మహిళలకు T24 టికెట్‌ను కేవలం రూ.80కే అందించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90, సీనియర్ సిటిజన్లకు రూ.80లకు విక్రయిస్తుండగా.. తాజాగా మహిళలకు కూడా రూ.10 తగ్గించి రూ.80కే ఇవ్వనుంది. ఈ కొత్త T24 టికెట్ ధర మే 09వ తేదీ మంగళవారం నుంచి అమలులోకి రానుంది. హైదరాబాద్ లో నడిచే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు కొనుగోలు 24 గంటల పాటు ప్రయాణం చేయవచ్చు.

సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెంచే ఉద్దేశంతో T 24 టికెట్ ను తీసుకొచ్చారు. దీని ధరను రూ.100 ఉండేది.. కానీ ఇటీవలే రూ. 10 తగ్గించి రూ.90 చేశారు. T 24 టికెట్ తో పాటు T 6 టికెట్ కూడా తీసుకొచ్చారు. ఈ టికెట్ రూ. 50 కొనుగోలు చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణం చేయవచ్చు. రూ. 300 చెల్లించి ఎఫ్-24 టికెట్ కొనుగోలు చేస్తే.. ఆ టికెట్‌పై నలుగురు వ్యక్తులు రోజంతా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.
టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులపైనే కాకుండా రద్దీగా ఉండే రూట్లపై దృష్టి సారించింది. తాజాగా భక్తుల డిమాండ్ మేరకు హైదరాబాద్ ఎంజీబీఎస్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రతి అర గంటకు ఒక బస్సును శ్రీశైలం క్షేత్రానికి నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి రీజియన్‌ల నుంచి నడుపుతామని పేర్కొన్నారు. అంతే కాకుండా రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్ విజయవాడ రూట్లలో నడిచే బస్సుల్లో టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications