TSRTC బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్ టికెట్లపై బంపర్ ఆఫర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇది వరకు రాఖీ పండగ నాడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులను అందజేసింది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. ప్రతి దసరా, సంక్రాంతి పండగ సీజన్‌లల్లో దీన్ని అమలు చేయనుంది.
అదే సమయంలో మరో ఆఫర్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. దసరా పండగకు స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త వినిపించింది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే వారికి ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయతీ ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఈ తేదీల మధ్యకాలంలో ఎప్పుడు ప్రయాణించినా, దానికి అవసరమైన టికెట్లను అడ్వాన్స్డ్‌గా బుక్ చేసుకుంటే టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ వర్తిస్తుంది. రానుపోను ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుంది. తెలంగాణలో బతుక్మమ్మ, దసరాను పెద్ద పండగలు.
ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు తరలి వెళ్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలపై మరింత వెసలుబాటు కల్పించడంలో భాగంగా 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించిందని వీసీ సజ్జనార్ తెలిపారు.
దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుందని తెలిపారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సందర్శించాలని సూచించారు.












Click it and Unblock the Notifications