వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరమైతే తెలంగాణ బంద్.. ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జేఏసీ నేతల ఆగ్రహానికి కారణమవుతోంది. టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ధోరణి సరికాదని.. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. ఆర్టీసీ సమ్మెకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. సమ్మె నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి ప్రెస్ క్లబ్‌లో అఖిల పక్షం సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన పలు అంశాలు ప్రస్తావించారు.

5వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె.. మరింత ఉధృతమా..! కాసేపట్లో అఖిలపక్షం భేటీ5వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె.. మరింత ఉధృతమా..! కాసేపట్లో అఖిలపక్షం భేటీ

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన ఆల్ పార్టీ మీటింగ్‌కు అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలను ఆహ్వానించారు. ఆ క్రమంలో ఈ భేటీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మె - ప్రభుత్వ నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చించి అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

 tsrtc jac warns government if necessary will give telangana bandh call

14 ఏళ్లుగా హరీశ్ రావుతో మాటల్లేవు.. ప్రజా సంక్షేమం కోసం తప్పలేదు : జగ్గారెడ్డి14 ఏళ్లుగా హరీశ్ రావుతో మాటల్లేవు.. ప్రజా సంక్షేమం కోసం తప్పలేదు : జగ్గారెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమ్మె జీతాల కోసం కాదని మరోసారి స్పష్టం చేశారు అశ్వత్థామ రెడ్డి. ఇన్నేళ్లుగా ఆర్టీసీని నమ్ముకుని బతుకుతున్న కార్మికులు సంస్థ మనుగడ కోసం ఆరాటపడుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేగానీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా జీతాల పెంపు కోసం కాదన్నారు. సీఎం కేసీఆర్ చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారని.. కార్మికులు నెలనెలా దాచుకుంటున్న పీఎఫ్ సొమ్ము చెల్లించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు.

ఆర్టీసీపై డిజీల్ భారం ఎక్కువైందన్నారు అశ్వత్థామ రెడ్డి. డిజీల్‌పై 27 శాతం పన్ను వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అదలావుంటే ఈ ఐదేళ్లలో ఆర్టీసీలో ఒక్క నియామకమైనా జరిగిందా అంటూ నిలదీశారు. తెలంగాణలో నాలుగో వంతు ప్రజలు రవాణా విషయంలో పూర్తిగా ఆర్టీసీపై ఆధారపడుతున్నారని.. అలాంటి వారంతా సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

English summary
tsrtc jac warns government if necessary will give telangana bandh call
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X