ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు సజ్జనార్ కీలక సూచన..!! (వీడియో)
తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి భారీ స్పందన కనిపిస్తోంది. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని సిబ్బంది యాజమన్యానికి నివేదించారు. ఈ సమయంలో మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వీడియో ద్వారా కీలక సూచన చేసారు. దూర ప్రాంత ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందన్న అంశాన్ని వివరించారు.
పెరుగుతున్న ఆదరణ: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. ఈ సమయంలో సజ్జనార్ పూర్తి సమాచారం ఇస్తూ కీలక ప్రకటన చేసారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వివరించారు.
సజ్జనార్ విజ్ఞప్తి: తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ కోరారు.
మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసారు.
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి… pic.twitter.com/bJryVNNxkM
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 23, 2023
సహకరించండి: ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం.
అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని సజ్జనార్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications