వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్; సైబర్ నేరగాళ్ళు ఏం చేశారంటే!!

|
Google Oneindia TeluguNews

ఇటీవల కాలంలో ఏ విషయమైనా ఎవరు చెప్పాలనుకున్నా సోషల్ మీడియా వేదిక గానే చెప్పడం ప్రధానంగా మనం చూస్తున్నాం. సోషల్ మీడియా అంతగా మన జీవితంలో అంతర్భాగమైపోయింది. అయితే ఇటువంటి సమయంలో సోషల్ మీడియాను కూడా సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ప్రముఖ సంస్థలు, సినీ, రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేస్తున్నారు. ఇక ఆ ఖాతాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.

 సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్


నిన్నటికి నిన్న బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ కాగా, తన అకౌంట్ ద్వారా ఎవరైనా ఏదైనా పోస్ట్ పెడితే స్పందించవద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇక తాజాగా టి ఎస్ ఆర్ టి సి ఎండి సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఇక ఇదే విషయాన్ని టిఎస్ఆర్టిసి సంస్థ కూడా ధ్రువీకరించింది. ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి వాటి ద్వారా చాలామంది సైబర్ నేరగాళ్లు మోసాలనికి పాల్పడుతున్నారు. ఇక తాజాగా సజ్జనార్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ట్విట్టర్ హ్యాండిల్ ను మార్చారు. ఆర్టీసీ ఎండి స్థానంలో ఫ్రాంక్లిన్ అని పేరు మార్చి, డిపి స్థానంలో కోతి ఎమోజిని పెట్టి, హ్యాక్ చేసిన అనంతరం వరుసగా పోస్టులు పెట్టారు.

అకౌంట్ పునరుద్ధరించే పనిలో టెక్నికల్ టీం

అకౌంట్ పునరుద్ధరించే పనిలో టెక్నికల్ టీం

ప్రస్తుతం ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ కావడంతో ఆర్టీసీ టెక్నికల్ టీం అధికారులు రంగంలోకి దిగారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ కావడం దురదృష్టకరమైన సంఘటన అంటూ టిఎస్ఆర్టిసి పేర్కొంది. ఇక హ్యాక్ అయిన ట్విట్టర్ అకౌంటును మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నాలలో టెక్నికల్ టీం ఉన్నట్టుగా తెలుస్తుంది .అంతేకాదు ప్రస్తుతం సదరు ఎకౌంట్ నుంచి ఎటువంటి ట్వీట్లు చేయడం కానీ రిప్లై ఇవ్వడం కానీ జరగడం లేదని టిఎస్ఆర్టిసి పిఆర్ఓ వెల్లడించారు.

ఆర్టీసీ ఎండీ గా వచ్చాక ఆర్టీసీ ట్విట్టర్ హ్యాండిల్ కు ప్రచారం తెచ్చిన సజ్జనార్

ఆర్టీసీ ఎండీ గా వచ్చాక ఆర్టీసీ ట్విట్టర్ హ్యాండిల్ కు ప్రచారం తెచ్చిన సజ్జనార్

ట్విట్టర్ సపోర్ట్ తీసుకుని ఎకౌంటు మళ్ళీ పునరుద్ధరిస్తున్నామని, త్వరలో మళ్లీ అకౌంట్ అందుబాటులోకి వస్తుందని వారు చెప్తున్నారు. టిఎస్ఆర్టిసి కి ఎండి గా వచ్చిన తర్వాత సజ్జనార్ ఆర్టీసీకి మంచి పేరు ప్రతిష్టలను తీసుకువచ్చారు. అంతకుముందు బాగా యాక్టివ్ గా లేని ట్విట్టర్ హ్యాండిల్ ను ఆయన చాలా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఆర్టీసీ అభివృద్ధికి కూడా ఆయన ఎంతో కీలకంగా పనిచేస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ట్విట్టర్ వేదికగా ఆయన ప్రజలతో పంచుకుంటున్నారు. ప్రజల నుండి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆర్టీసీని ప్రగ్గతి పథంలో నడిపించటానికి ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Recently TSRTC MD Sajjanar's Twitter account was hacked. TSRTC has also confirmed the same. Technical team is working on recovery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X