వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె, ఢిల్లీకి వెళ్లిన లక్ష్మణ్... జాతీయ నేతలకు ఫిర్యాదు...?

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో గత 29 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె మరింత విస్తృతం చేసేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నాలు చేస్తుంటే... సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్న బీజేపీ నాయకత్వం రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరు, ఆర్టీసీ సమ్మె పరిణామాలను పార్టీపరంగా జాతీయపార్టీతోపాటు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనుంది. ఇందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. సీఎం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు.

అటు ప్రభుత్వం.. ఇటు టీఎస్ఆర్టీసి..!మద్యలో జీహెచ్ఎంసీ..! ఆర్టీసీ సమ్మెలో ఎన్ని మలుపులో..!!అటు ప్రభుత్వం.. ఇటు టీఎస్ఆర్టీసి..!మద్యలో జీహెచ్ఎంసీ..! ఆర్టీసీ సమ్మెలో ఎన్ని మలుపులో..!!

ఆర్టీసీ సమ్మెను భుజాన ఎత్తుకున్న బీజేపీ

ఆర్టీసీ సమ్మెను భుజాన ఎత్తుకున్న బీజేపీ

ఆర్టీసీ సమ్మెను బీజేపీ తన భుజాన ఎత్తుకుంది. కార్మికులకు పూర్తి భరోసాను కల్పించేందుకు ఆపార్టీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు ఎంపీ లు మరోవైపు రాష్ట్ర పార్టీ నేతలు అనేక చోట్ల ఆందోళన నిర్వహిస్తుండడంతో పాటు ఆయా జిల్లాల్లో కూడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం పాల్గోంటున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇన్నిరోజులు... ఆందోళన చేస్తున్న.... అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ సమ్మె పరిష్కరానికి దిగివచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రంతో పాటు సమస్యను జాతీయపార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లి వారిని జోక్యం తీసుకునేందుకు బీజేపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఢిల్లీ వెళ్లేముందు జేఏసీ నేతలతో భేటి అయిన లక్ష్మణ్

ఢిల్లీ వెళ్లేముందు జేఏసీ నేతలతో భేటి అయిన లక్ష్మణ్

సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరీని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లి, వెంటనే చర్యలు చేపట్టే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరుతూ జేఏసీ నేతలు అశ్వథ్దామ రెడ్డితోపాటు జనసమితి నేత కోదండరాం లక్ష్మణ్‌తో భేటి అయ్యారు. సమావేశంలో ముఖ్యంగా కేంద్రం ముందు ఉంచాల్సిన అంశాలపై చర్చించారు. కేంద్రానికి సమర్పించేందుకు ఓ నివేదికను అందించినట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీ చేరుకున్న లక్ష్మణ్ సాయంత్రం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతోపాటు ఇతర ప్రభుత్వ పెద్దలతో కూడ సమావేశం కానున్నారు.

గవర్నర్‌‌పై ఒత్తిడి

గవర్నర్‌‌పై ఒత్తిడి

ఇక పార్టీపరంగా లక్ష్మణ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా మరోవైపు అధికారికంగా కేంద్రానికి సమాచారం ఇచ్చేందుకు జేఏసీ నేతలతోపాటు బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ చర్యలపై జోక్యం చేసుకోవాలని ఆమేను కోరారు. దీంతో గవర్నర్ సైతం సమ్మెపై వివరణ కొరింది. సంబంధిత రవాణశాఖ మంత్రి అయిన పువ్వాడ అజయ్‌తో నేరుగా ఫోన్లో మాట్లాడారు. అయితే అటు గవర్నర్ కూడ జోక్యం చేసుకున్నా ప్రభుత్వంలో కదలికలు మాత్రం కనిపించడం లేదనే అవేదనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక కేంద్రాన్ని రంగంలోకి దింపాలని పావులు కదుపుతోంది. మరి కేంద్రంతోపాటు పార్టీ పెద్దలు ఎలాంటీ సలహాలు ,సూచనలు ఇస్తారో వేచి చూడాలి.

 కేంద్రం ఇచ్చిన ఆయుధాన్నే ఎక్కుపెట్టిన సీఎం

కేంద్రం ఇచ్చిన ఆయుధాన్నే ఎక్కుపెట్టిన సీఎం

ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఇటివల కేంద్రం తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్ట సవరణను తనకు అనుకూలంగా మల్చుకున్నారు. ప్రజారవాణ వ్యవస్థలో ప్రైవేట్ రూట్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ నూతన సవరణ చట్టం ఉండడంతో, ఇప్పుడు అదే చట్టాన్ని ఉపయోగించుకుని ఆర్టీసీలో యాబైశాతం మేర ప్రైవేటికరణ చేసేందుకు సీఎం పావులు కదుపుతున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి అమోదముద్ర వేయనున్నారు. దీంతో పాటు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడ ప్రజారవాణ వ్యవస్థపై ఆయన పలు వివరాలను వెల్లడించారు..

English summary
State BJP president Laxman went to Delhi to explain the consequences of the ongoing RTC strike to the central government as well as to the national party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X