వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అటు ప్రభుత్వం..ఇటు ప్రతిపక్షాలు: మధ్యలో ఆర్టీసీ కార్మికులు: సమ్మె నేడు కొత్త టర్న్..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అయిదో రోజుకు చేరింది. ఈ రోజు నుండి సమ్మెను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదే సమయంలో దీనిని రాజకీయంగా తమకు అనుకూలగా మలచు కొనేందుకు..ప్రభుత్వం పైన పై చేయి సాధించేందుకు ప్రతిపక్షాలు దీనిని అవకాశంగా మలుచుంటున్నాయి. అందులో భాగంగా ఈ రోజుల అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఒక వైపు ప్రభుత్వం ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటూ ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రయివేటు భాగస్వామ్యం తప్పదని స్పష్టం చేసారు. పదో తేదీన కోర్టు ముందు ఈ అంశం మరో సారి చర్చకు రానుంది.

ఇక, అన్ని జిల్లాల్లో కలెక్టర్లు డిపోల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో మరోసారి ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఇలా..రాజకీంగా.. న్యాయ పరమైన అంశాలతో ఈ సమ్మె కొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రతిపక్షాల మద్దతు..కొత్త కార్యాచరణ ఖరారు దిశగా ఈ రోజుల అఖిల పక్ష సమావేశం జరగనుంది.

నేటి నుంచి సమ్మె ఉధృతం ..

నేటి నుంచి సమ్మె ఉధృతం ..

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి పైన చర్చించి..భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన జరిగే.. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను జేఏసీ ఆహ్వానించింది. అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. మరోవైపు బుధవారమే అన్ని జిల్లాల్లో కూడా రాజకీయ నాయకులతో ఆర్టీసీ ఉద్యోగులు సమావేశం కానున్నారు. ఇతరత్రా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో...ఈ రోజు ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాల ఆధారంగా ప్రభుత్వ వైఖరి స్పష్టం కానుంది.

సీఎం..అధికారులు నిరంతర మంతనాలు

సీఎం..అధికారులు నిరంతర మంతనాలు

సమ్మెని విరమించి విధుల్లో చేరాలని ఓ వైపు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాత్కలికంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు వాహానాలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు పూర్తి కార్యాచరణ రంగం సిద్ధం చేశారు. మరోవైపు డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మెను విరమించేదే లేదని కార్మికులు ప్రకటించారు. ఈ ఏకంగా ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమంటూ కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్మికులకు మద్దతుగా నిలవాలని ప్పటికే నిర్ణయించారు. వీరి మద్దతుతో కార్మికులు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

అఖిలపక్ష నిర్ణయాలు..ప్రభుత్వ స్పందన..

అఖిలపక్ష నిర్ణయాలు..ప్రభుత్వ స్పందన..

ఇక, ఇప్పటి వరకు తీవ్ర హెచ్చిరికలతో పాటుగా ప్రయివేటు భాగస్వామ్యం ఆర్టీసీలో తప్పదని స్వయంగా ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తేవటం..సమ్మెను తీవ్రతరం చేసే దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఇక, అఖిలపక్ష సమావేశంలో తీసుకొనే నిర్ణయాల ఆధారంగా ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కార్మికుల మీద ఒత్తిడి పెంచే వ్యూహాలను అమలు చేసిన ప్రభుత్వం..అఖిలపక్షం ఉద్యమం దిశగా కార్యాచరణ ప్రకటిస్తే ప్రభుత్వం వెనుకడుగు వేసి చర్చలకు ఆహ్వానిస్తుందా లేక మరింత కఠినంగా ముందుకు వెళ్తుందా అనే చర్చ ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, ప్రభుత్వం సైతం చివరి నిమిషం వరకు కార్మికులకు దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నాలకే ప్రాధాన్యత ఇస్తోంది.

English summary
TSRTC Strike may take new turn today. RTC unions conducting all party meet to day to decide future action plain in part of strike. At the same time govt taking necessary steps to provide alternate transport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X