TSRTC STRIKE:సమ్మెపై కలుగజేసుకొండి, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌కు విపక్షాల విజ్ఞప్తి..
Recommended Video
ఆర్టీసీ సమ్మెపై కలుగజేసుకోవాలని విపక్ష నేతలు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను కోరారు. కార్మికుల సమ్మె 27వ రోజుకు చేరిన ప్రభుత్వంలో ఉలుకు, పలుకు లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి సూచించాలని విన్నవించారు. తమ సూచనలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని వారు మీడియాకు తెలిపారు.
ఆర్టీసీ సమ్మె ఉదృతంగా కొనసాగుతుంది. 27వ రోజుకు సమ్మె చేరడంతో అఖిలపక్ష నేతలు గవర్నర్‌ను కలిశారు. కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు, కోదండరాం, రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, బీవీ మోహన్ రెడ్డి, చెరకు సుధాకర్ తదితరులు గవర్నర్‌ను కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని కోరారు.

ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కోరగా ఆమె సానుకూలంగా స్పందించారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం దిశగా చొరవ తీసుకుంటానని తెలిపినట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీలో 31 శాతం కేంద్రప్రభుత్వం వాటా ఉందని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. మంత్రివర్గంలో ఉన్న ఉద్యమనేతలు ఆర్టీసీ కార్మికుల తరఫున ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సకల జనుల సమ్మెలో కార్మికులు కలిసి రాలేదా ? ఉద్యమానికి ఊతం ఇవ్వలేదా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications