వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Group-4: గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. ఎందుకంటే..!

|
Google Oneindia TeluguNews

శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియను టీఎస్ఎస్పీఎస్సీ వాయిదా వేసింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు పేర్కొంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు గ్రూప్-4 దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 25న 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆబ్జెక్టివ్‌ విధానం

ఆబ్జెక్టివ్‌ విధానం

వీటిలో అత్యధికంగా మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ 6,859 ఉద్యోగాలు ఉన్నాయి. ఉన్నత విద్యా శాఖలో 742, బీసీ వెల్ఫేర్ 307, హోం శాఖ 133, పంచాయతీ రాజ్ 1245, రెవెన్యూ శాఖ 2,077 పోస్టులున్నాయి. గ్రూప్ 4 పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహిస్తామని ఇప్పటికే టీఎస్పీఎస్సీ తెలిపింది.

వెట‌ర్నరీ, హార్టిక‌ల్చర్

వెట‌ర్నరీ, హార్టిక‌ల్చర్

గ్రూప్‌-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్‌ అంచనా వేస్తోంది. గత అనుభవాల దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తులు కనీసం 6-7 లక్షల మధ్యలో రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెట‌ర్నరీ, హార్టిక‌ల్చర్ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న 207 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది.

185 పోస్టులు

185 పోస్టులు

వీటిలో వెటర్నరీ విభాగంలో 185 వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టుల‌ు ఉండగా, హార్టిక‌ల్చర్ విభాగంలో 22 హార్టిక‌ల్చర్ ఆఫీస‌ర్ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 30 నుంచి వ‌చ్చే నెల 19వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు. హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ ఉద్యోగాల‌కు జ‌న‌వ‌రి 3 నుంచి అదే నెల 24వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

గ్రూప్-2 నోటిఫికేషన్

గ్రూప్-2 నోటిఫికేషన్

త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈనెల 27న గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు సమాచారం. మొత్తం గ్రూప్-2 ఖాళీల సంఖ్యను 783గా గుర్తించారు. గ్రూప్-1 కు సంబంధించి సైతం ఈ నెల 30వ తేదీలోపు ప్రిలిమ్స్ ఫలితాలను విడదుల చేసే అవకాశం ఉంది.

English summary
TSSPSC has postponed the Group-IV application process which was supposed to start from Friday. It has been postponed due to technical reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X