వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రంగారెడ్డి టిడిపి అడ్డా, అందుకే జిల్లా ప్రజలపై కెసిఆర్ కుట్ర'(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంతా పిచ్చిపిచ్చిగా చేస్తున్నారని తెలంగాణ టిడిపి నేతలు గురువారం మండిపడ్డారు. ఆయనకు ఏమైనా మెంటల్ లేచిందా అని ప్రశ్నించారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాదులో టిడిపి జిల్లా అధ్యక్షులు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఒకరోజు దీక్షను చేపట్టారు.

టిడిపి, బిజెపి, సిపిఐ, కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. కెసిఆర్ ప్రజలను మోసం చేయడంలో, అబద్దాలు ఆడటంలో దిట్ట అన్నారు.

ప్రకాశ్ గౌడ్

ప్రకాశ్ గౌడ్

పూటకో హామీ ఇస్తూ పిట్టల దొరను మరిపిస్తున్నాడన్నారు. ఆరు నూరైనా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకుజాతీయ హోదా సాధిస్తామని చెప్పి, ఇప్పుడు డిజైన్ ఎందుకు మారుస్తున్నారో చెప్పాలన్నారు.

 ప్రకాశ్ గౌడ్

ప్రకాశ్ గౌడ్

రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరు రాకుండా కెసిఆర్ పగబట్టారని, టిఆర్ఎస్ నేతలను పిచ్చికుక్కలను కొట్టినట్లు కొడితేనే బుద్ది వస్తుందన్నారు. ప్రాణహిత సాధన పోరాటానికి బిజెపి మద్దతిస్తోందని ఎమ్మెల్సీ రామచంద్ర రావు చెప్పారు.

 ప్రకాశ్ గౌడ్

ప్రకాశ్ గౌడ్

రంగారెడ్డి జిల్లా టిడిపికి అడ్డా అని, జిల్లా ప్రజల పైన పగతోనే కెసిఆర్ ఈ ప్రాజెక్టు డిజైన్ మార్పు చేశారన్నారు. జిల్లా ప్రజలు టిఆర్ఎస్ నేతలను గ్రామాల్లోకి రాకుండా రాళ్లతో కొట్టాలన్నారు.

 ప్రకాశ్ గౌడ్

ప్రకాశ్ గౌడ్

జిల్లా టిడిపి నేతల పైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అవసరమైతే ప్రాణాలు అర్పించి అయినా ప్రాణహిత డిజైన్ మార్పును అడ్డుకోవాలని జిల్లా నాయకులకు సూచించారు.

 ప్రకాశ్ గౌడ్

ప్రకాశ్ గౌడ్

మంత్రి మహేందర్ రెడ్డికి ధైర్యం ఉంటే కెసిఆర్‌ను నిలదీయాల్నారు. చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టే యోచన మానుకోవాలని, చీప్ లిక్కర్ ద్వారా కల్లు గీత కార్మికుల పొట్ట గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

English summary
TTDP dharna in shamshabad against Pranahita Design
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X