వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నువ్వా - నేనా : మునుగోడు మెజార్టీ దోబూచులాట - ఆధిక్యతలో రాజగోపాల్..!!

|
Google Oneindia TeluguNews

మునుగోడులో ఊహించిన విధంగానే ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతోంది. దుబ్బాక తరహాలోనే టీఆర్ఎస్ - బీజేపీ నువ్వా నేనా అన్నట్లు తొలి రౌండ్లలో కనిపిస్తోంది. నాలుగో రౌండ్ ముగిసే సరికి బీజపీ ఆధిక్యతలో ఉంది. మునుగోడు కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ నుంచే హోరా హోరీ గా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో మొత్తం 686 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో టీఆర్ఎస్ కు 228 ఓట్లు రాగా, బీజేపీకి 224 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ కు 88 ఓట్లు వచ్చాయి. బీఎస్పీకి 10 ఓట్లు పోలయ్యాయి. దీంతో, పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ 4 ఓట్ల ఆధిక్యత సాధించింది. బీజేపీకి పట్టున్న చౌటుప్పల్ మండలంలో తొలి రౌండ్ లో టీఆర్ఎస్.. మిగిలిన రౌండ్స్ లో బీజేపీ ఆధిక్యత సాధించింది. ఈ మండలంలో మొత్తంగా 55,678 ఓట్లు పోలయ్యాయి.

నాలుగు రౌండ్లు ఇదే మండలానికి సంబంధించి కౌంటింగ్ కొనసాగింది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ 1352 ఓట్ల మెజార్టీ సాధించింది. తొలి రౌండ్ లో చౌటుప్పల్ రూరల్ ప్రాంతంలోని 20 పోలింగ్ కేంద్రానివి. అక్కడ టీఆర్ఎస్ కు 6478 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 5126 ఓట్లు దక్కాయి. కాగా, కాంగ్రెస్ కు 2100 మాత్రమే పోలయ్యాయి. రెండో రౌండ్ లో బీజేపీ 841 ఓట్ల ఆధిక్యత సాధించింది. రెండో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7781 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 8622 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 1532 ఓట్లు దక్కాయి. దీంతో, తొలి రౌండ్ లో టీఆర్ఎస్ సాధించిన 1352 ఓట్ల మెజార్టీని, 515 ఓట్ల కి తగ్గించింది. మూడో రౌండ్ లో చౌటుప్పల్ మున్సిపాల్టీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగింది. మూడో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7010, బీజేపీకి 7426, కాంగ్రెస్ 1532 ఓట్లు వచ్చాయి.

Tug of war in Munugode by poll TRS vs BJP, mjaority chaning round by round between two parties

కాగా, మూడో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ 35 ఓట్ల ఆధికత్యలో ఉంది. నాలుగు..అయిదో రౌండ్ లోనూ బీజేపీ మెజార్టీ సాధించింది. బీజేపీ ఆధిక్యత సాధించింది. బీజేపీ ఆశించిన విధంగానే చౌటుప్పల్ లో ఆధిక్యత ప్రదర్శించింది. ఇప్పుడు అయిదో రౌండ్ నుంచి నారాయణ్ పూర్ ప్రాంతానికి సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. తిరిగి చండూరు మండలం పైన రాజగోపాల్ ఆశలు పెట్టుకున్నారు. మునుగోడు లో రెండు పార్టీల మధ్య హోరా హోరీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

English summary
TRS leads in Munugode first round with 1192 votes against BJP Candidate Rajagopal Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X