Runa Mafi: రుణ మాఫీపై తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన..!

తెలంగాణలో రుణ మాఫీ కాక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణ మాఫీ ఎప్పుడు చేస్తారో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రుణ మాఫీ కోసం రూ.31 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పిన ప్రభుత్వం రూ.18 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉన్నా తమకు రుణ మాఫీ కాలేదని రైతులు వాపోతున్నారు. తమకు రుణ మాఫీ చేయకుంటే ప్రభుత్వ పతనం ఖాయమంటున్నారు.

మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రైతుల వాదనకు భిన్నంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెబుతున్నారు. రైతు రుణ మాఫీ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు 22 లక్షల రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేశామని వివరించారు. అయితే కొంత మందికి రుణ మాఫీ కాలేదని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు.

Tummala Nageswara Rao made a key statement on farmer loan waiver

త్వరలోనే వారికి కూడా రుణ మాఫీ చేస్తామని తెలిపారు. అయితే రుణ మాఫీ కాని వారు కొంత మంది కాదు లక్షల్లో ఉన్నట్లు బీజేపీ, బీఆర్ఎస్ చెబుతోంది. కొంత మందికి చేసి రుణ మాఫీ పూర్తి అయిపోయినట్లు కాంగ్రెస్ చంకలు గుద్దుకుంటుందని విమర్శించింది. రైతు రుణ మాఫీ చేయకుంటే కాంగ్రెస్ పని పడతామని హెచ్చరిస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. రుణ మాఫీపై త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

ఏ పథకమైనా కొంత మందికి ఇచ్చి అందరికి ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే.. చాలా మంది రైతులు రుణ మాఫీ కాలేదు. వారంతా వ్యవసాయ అధికారులు, బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+