Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లిపై ఆమెకు హెచ్చరిక: రౌడీ షీటర్‌ను చంపేసిన తుపాకి ముఠా

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తుపాకీ ముఠా హత్యకేసును పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో తుపాకీతో రౌడీషీటర్‌ను హతమార్చిన ముఠాను అరెస్టు చేశారు.

మహబూబాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తుపాకీ ముఠా హత్యకేసును పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో తుపాకీతో రౌడీషీటర్‌ను హతమార్చిన ముఠాను అరెస్టు చేశారు. నిందితులను తొర్రూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ కోటిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.

ఆయన కథనం ప్రకారం.. దంతాలపల్లి మండలం రెపోణి గ్రామానికి చెందిన మృతుడు కొంపెల్లి యాకయ్య (గ్రామ తెరాస ఉపాధ్యక్షుడు) జూన్‌ 28వ తేదీ రాత్రికుమ్మరికుంట్ల గ్రామంలో చిన్నబోయిన ధనమ్మ ఇంటి వెనుక గాయాలతో పడిఉన్నాడు. గమనించిన స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు అతన్ని తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని ఓప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే అతను మృతి చెందినట్లు చెప్పారు.

Tupaki gang arrsted in a murder case

తన కుమారుడి మరణంపై అనుమానం ఉందని మృతుని తండ్రి కొంపెల్లి లింగయ్య జూన్‌ 29న దంతాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన పోస్టుమార్టంలో మృతుని తలనుంచి తూటా లభించటం, జేబులో సీపీఐ ఎంఎల్‌ సూర్యాపేట జిల్లా కమిటీ కార్యదర్శి జగదీష్‌ పేరిట లేఖ దొరకడంతో హత్య రాష్ట్రస్థాయిలో సంచలనం రెకేత్తించింది.

తొర్రూరు డీఎస్పీ రాజారత్నం ఆధ్వర్యంలో సీఐ చేరాలు, దంతాలపల్లి ఎస్సై వేంకటేశ్వర్లు, పెద్దవంగర ఎస్సై పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంకు కేసు విచారణ అప్పగించారు. హత్యకేసులో ప్రధాన నింధితులైన దంతాలపల్లికి చెందిన తండ ఉపేంద్ర, ఖమ్మంకు చెందిన పసుల లింగయ్య, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నెమలిపురం గ్రామానికి చెందిన బర్ల జయమ్మ బయ్యారంలో ఉన్నట్లు తెలుసుకొని ఈనెల 3వ తేదీన వారిని అదుపులోకి తీసుకొని విచారించగా కేసు వివరాలు బయటపడ్డాయి.

ఓ పెళ్లి విషయంలో యాకయ్య నిందితురాలు ఉపేంద్రను బెదిరించటంతో అది మనసులో పెట్టుకున్న ఆమె ఎలాగైన అతన్ని హత్యచేయాలని నిర్ణయించుకుంది. విషయాన్ని రేపోణి సర్పంచి రాగి రామ్మూర్తి, మాజీ సర్పంచి గుండెగాని లింగయ్యకు చెప్పడంతో వారు మృతుడు ప్రతి విషయంలో తమకు అడ్డుపడుతున్నాడని, అతన్ని చంపితే అందుకు అయ్యే ఖర్చులో తాముకూడా కొంత భరిస్తామని చెప్పారు.

దీంతో ఉపేంద్ర తనకు సన్నిహితులైన సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన కుంచెం లింగయ్య, చామకూరి నారాయణలతోపాటు హైదరాబాద్‌కు చెందిన బత్తుల ప్రదీప్‌ అతని స్నేహితుడు ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణతో యాకయ్యను చంపడానికి రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

తరువాత వారు నిర్లక్ష్యం చేయడంతో ఉపేంద్ర ప్రదీప్‌ను గట్టిగా నిలదీసింది. దాంతో మరో స్నేహితుడైన రావుల శ్రీనివాస్‌ను పిలిపించి అతనితో రూ.2 లక్షలకు మరో బేరం మాట్లాడుకొని లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. దీంతో పథకం ప్రకారం జూన్‌ 29న కుమ్మరికుంట్ల గ్రామంలోని ధనమ్మ ఇంటి వద్ద ఉన్న మద్యం గొలుసు దుకాణానికి వచ్చిన యాకయ్యను రాత్రి 10:30 గంటల సమయంలో కుంచం లింగయ్య, రావుల శ్రీను, పసుల లింగయ్య తమవెంట తెచ్చుకున్న తుపాకీతో తలపై కాల్చారు.

అతని జేబులో లేఖ పెట్టి అక్కడి నుంచి ముగ్గురు పారిపోయి విషయాన్ని ఉపేంద్రకు చెప్పి నారాయణ ఆటోలో ఖమ్మం వెళ్లారు. అక్కడ జయమ్మకు హత్యచేసిన విషయం చెప్పి నేరుగా రాజమండ్రి పారిపోయారు. అక్కడ తమకు పరిచయం ఉన్న జయరాజ్‌కు జరిగిన విషయం చెప్పి అతనివద్ద కొన్ని రోజులు ఆశ్రయం పొంది తరువాత తప్పించుకొని తిరుగుతున్నారు.

దర్యాప్తు సాగుతున్న తరుణంలో నిందితులు బయ్యారంలో ఉన్నట్లు సమాచారం మేరకు వారిని అదుపులోనికి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని ఎస్పీ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 11 మందిని గుర్తించి వారిలో ఆరుగురిని అరెస్టుచేశామన్నారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ, రూ.10 వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

తండ ఉపేంద్ర, పసుల లింగయ్య, బర్ల జయమ్మ, శామకూరి నారాయణ, గుండగాని లింగయ్య, రాగి రామ్మూర్తిని అరెస్టు చేయగా రావుల శ్రీను,కుంచెం లింగయ్య, బత్తుల ప్రదీప్‌, రామకృష్ణ, జయరాజ్‌ పరారీలో ఉన్నారన్నారు. వీరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో నక్సల్స్‌ ప్రాబల్యం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ రాజారత్నం, సీఐ చేరాలు, ఎస్సైలు రమణమూర్తి, వేంకటేశ్వర్లు, పవన్‌కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+