అసలేం జరిగింది?: ఆత్మహత్య చేసుకున్న టీవీ యాంకర్

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. నగరంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు చెందిన యాంకర్ ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలోని ఓ లేడీస్ హాస్టల్‌లో బుధవారం రాత్రి ఉరివేసుకుని నిరోషా ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నిరోషా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. జెమినీ మ్యూజిక్ ఛానల్‌లో యాంకర్‌గా చేరడానికి ముందు నిరోషా పలు న్యూస్ ఛానలల్లో రిపోర్టర్‌గా పనిచేసింది.

మృతురాలిది ఏపీలోని చిత్తూరు జిల్లా సోమలా మండలం మల్లేశ్వరంలో నివసిస్తున్నారు. ఒకే మ్యూజిక్ ఛానల్‌కు మరో యాంకర్‌తో కలిసి నిరోషా సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలోని ఓ లేడీస్ హాస్టల్‌ ఉంటోంది. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు కెనడాలో ఉన్న బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త రిత్విక్‌తో మాట్లాడింది.

ఈ క్రమంలో కాబోయే భర్తను బెదిరించాలనే ఉద్దేశంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఉరివేసుకున్న హుక్ బిగుసుకుపోవడంతోనే ఆమె చనిపోయినట్లు ఆమె రూంమేట్‌గా ఉన్న మరో యాంకర్ చెప్పారు. యాంకర్ ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని ప్రాధమిక విచారణలో వెల్లడైంది.

యాంకర్ నిరోషా తల్లిదండ్రులు చిత్తూరు జిల్లాలోని మల్లేశ్వరంలో నివసిస్తున్నారు. కుమార్తె ఆత్మహత్య విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమెకు నెల రోజుల్లోనే పెళ్లి కావాల్సి ఉంది. ఇప్పటికే ఎంగేజిమెంట్ కూడా అయ్యింది. ఆమె వీడియో కాల్ మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.

దీంతో తీవ్ర మనస్థాపం చెందిన నిరోషా చనిపోతున్నట్లు బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. అయితే.. నెల రోజుల్లోనే పెళ్లి జరగాల్సి ఉండగా ఇప్పుడు ఎందుకు తిరస్కరించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యాంకర్ నిరోషా ప్రియుడు ఆమెను రాత్రి రెచ్చగొట్టే విధంగా ఏమైనా మాట్లాడారా? అనే కోణంలో విచారిస్తున్నారు.

ప్రస్తుతం యాంకర్ నిరోషాతో పాటు ఆమె ప్రియుడు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి ఫోన్ నుంచి డేటాను పోలీసులు రికవరీ చేస్తున్నారు. అనంతరమే దర్యాప్తులో ముందుకు వెళతామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిరోష

నిరోష

సికింద్రాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ నిరోష దృశ్యం. ఆమె సింధి కాలనీలోని ఓ లేడీస్ హాస్టల్‌లో బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

నిరోష

నిరోష

నిరోష జెమినీ మ్యూజిక్ ఛానల్‌లో యాంకర్‌గా చేరడానికి ముందు నిరోషా పలు న్యూస్ ఛానలల్లో రిపోర్టర్‌గా పని చేసింది.

నిరోష

నిరోష

మృతురాలిది ఏపీలోని చిత్తూరు జిల్లా సోమలా మండలం మల్లేశ్వరం. ఒకే మ్యూజిక్ ఛానల్‌కు మరో యాంకర్‌తో కలిసి నిరోషా సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలోని ఓ లేడీస్ హాస్టల్‌ ఉంటోంది.

నిరోష

నిరోష

బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు కెనడాలో ఉన్న బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త రిత్విక్‌తో మాట్లాడింది. ఈ క్రమంలో కాబోయే భర్తను బెదిరించాలనే ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

నిరోష

నిరోష

అయితే ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఉరివేసుకున్న హుక్ బిగుసుకుపోవడంతోనే ఆమె చనిపోయినట్లు ఆమె రూమ్మేట్‌గా ఉన్న మరో యాంకర్ చెప్పారు.

నిరోష

నిరోష

టెలివిజన్ రంగంలో అనతి కాలంలో నిరోష్ యాంకర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+