తల్లిసహాకారంతో పిల్లలపై అత్యాచారం చేస్తోన్న నిందితులు
రంగారెడ్డి :ముక్కుపచ్చలారని పసిపిల్లలు. వారిని మృగాళ్ళు దారుణంగా అత్యాచారం చేస్తున్నారు. ఈ నిందితులకు స్యయంగా తల్లే సహాకరించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి లో ని లక్ష్మీగూడలో ఈ దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటన చాల ఆలస్యంగా వెలుగుచూసింది.లక్ష్మీగూడలోని కవల పిల్లలు నాలుగో తరగతి చదువుతున్నారు.

కొంతకాలంగా ఈ కవలలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ నిందితులకు స్వయంగా తల్లే సహాకరిస్తోందని భాదితులు చెప్పారు.
ప్రతిరోజు తమపై అత్యాచారం జరుగుతున్నట్టు స్కూల్లో ఉపాధ్యాయులకు పిల్లలు చెప్పారు. వెంటనే ఉపాధ్యాయుడు ఆ పిల్లలను బాలల సంరక్షణ అధికారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications