షర్మిల పార్టీ పేరు మార్చాల్సిందే - ఎన్నికల సంఘం ట్విస్టు : రాజీ తప్పదా- లేకుంటే..!!
రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన వైఎస్ షర్మిలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ భారీ ట్విస్టు ఇచ్చింది. గత ఏడాది తన తండ్రి జన్మదినం నాడు షర్మిల అట్టహాసం గా తన పార్టీ పేరు వైఎస్సార్టీపీగా ప్రకటించారు. ఇప్పుడు అదే పేరుతో పార్ట కొనసాగింపుకు ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో..పార్టీ రిజిస్ట్రేషన్ సైతం నిలిచిపోయింది. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం మేరకు షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ ను నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదుతో
ఏపీలో ఇప్పటికే జగన్ నాయకత్వంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు తమ పార్టీ పేరును పోలి ఉందంటూ, ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ,సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈకేసు విచారణలో ఉంది. కాగా, తెలంగాణలో షర్మిల నాయకత్వంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ కూడా తమ పార్టీ పేరును పోలి ఉందంటూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతూ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

మరో పేరు సూచించాలంటూ
ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేసినట్లు వెల్లడించింది .వైయస్ షర్మిల కు మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని ఈ నెల 3 వ తేదీన లేఖ రాసింది. ఇప్పటికే వైఎస్సార్టీపీ పేరుతో షర్మిల తెలంగాణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ అధినేత్రిగా పాదయాత్ర సైతం నిర్వహిస్తున్నారు. దీక్షలు..నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఎన్నికల సంఘం పంపిన లేఖలో మరో పేరు ప్రతిపాదించాలని సూచించింది.
Recommended Video

నాడు వైఎస్సార్సీపీ విషయంలోనూ
దీని పైన న్యాయపోరాటం చేయటం లేదా... అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారితో రాజీ పడి.. గతంలో వైఎస్సార్సీపీ ప్రారంభంలో అమలు చేసిన ఫార్ములా అమలు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి.. షర్మిల తన తండ్రి పేరుతోనే పార్టీ పేరు కొనసాగించేందుకే మొగ్గు చూపటం ఖాయం. దీంతో..మరి ఇప్పుడు ఈ పార్టీ పేరు పైన మొదలైన అభ్యంతరాలు..ఎన్నికల సంఘం లేఖ పైన ఏ రకంగా స్పందిస్తారు.. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications