సినీఫక్కీలో వ్యాపారికి టోకరా: పోలీసులమని రూ.7.50లక్షల చోరీ

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పోలీసులమంటూ ఓ బంగారు వ్యాపారి బ్యాగులను తనిఖీలు చేసిన ఇద్దరు దుండగులు... అతని దృష్టి మరల్చి అందులోని రూ. 7.50లక్షల నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని మహంకాళి ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న సేలంకు చెందిన జ్యువెలరీ వ్యాపారి గోపీనాథ్‌ అక్కడ వెండి ఆఖరణాలు తయారు చేసుకువచ్చి, నగరంలో వ్యాపారస్తులకు విక్రయిస్తుంటారు.

చెన్నై-హైదరాబాద్‌ మధ్య వెండి ధరలో రూ.మూడు నాలుగొందల వ్యత్యాసం ఉంటోంది. దీంతో ఇక్కడే వెండి ఖరీదు చేసుకుని వెళ్లే గోపీనాథ్‌... ఆభరణాలు, వస్తువులు తయారు చేసి మళ్లీ నగరానికే తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. దీనికోసం వారానికి ఓ రోజు హైదరాబాద్‌ రావడం పరిపాటి కావడంతో బస చేయడానికి సుభాష్‌రోడ్‌లో ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు.

కాగా, ఎప్పటిలానే సేలం నుంచి ప్రైవేట్‌ బస్సులో వచ్చిన గోపీనాథ్‌ బుధవారం ఉదయం 8.30 గంటలకు లక్డీకపూల్‌లో దిగాడు. రెండు బ్యాగులతో వచ్చిన ఆయన అక్కడ నుంచి ఆటోలో సుభాష్‌రోడ్‌కు చేరుకున్నాడు. తాను నివసించే గది సమీపంలోనే బటర్‌ఫ్లై బేకరీ వద్ద ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇదే సమయంలో సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోపీనాథ్‌ను ఆపి తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీ బ్యాగులో మాదకద్రవ్యమైన బ్రౌన్‌షుగర్‌ ఉన్నట్లు సమాచారం వచ్చిందంటూ బెదిరించారు. తనిఖీలు చేయాలంటూ బ్యాగు తెరిచి చూపించాలని ఆదేశించారు. దీంతో గోపీనాథ్‌ అలాగే చేశాడు.

రూ.7.50లక్షల చోరీ

రూ.7.50లక్షల చోరీ

పోలీసులమంటూ ఓ బంగారు వ్యాపారి బ్యాగులను తనిఖీలు చేసిన ఇద్దరు దుండగులు... అతని దృష్టి మరల్చి అందులోని రూ. 7.50లక్షల నగదును అపహరించుకుపోయారు.

రూ.7.50లక్షల చోరీ

రూ.7.50లక్షల చోరీ

ఈ ఘటన సికింద్రాబాద్‌లోని మహంకాళి ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ కెమెరాకు చిక్కిన నిందితులు

సీసీ కెమెరాకు చిక్కిన నిందితులు

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న సేలంకు చెందిన జ్యువెలరీ వ్యాపారి గోపీనాథ్‌ అక్కడ వెండి ఆఖరణాలు తయారు చేసుకువచ్చి, నగరంలో వ్యాపారస్తులకు విక్రయిస్తుంటారు.

సీసీ కెమెరాకు చిక్కిన నిందితులు

సీసీ కెమెరాకు చిక్కిన నిందితులు

చెన్నై-హైదరాబాద్‌ మధ్య వెండి ధరలో రూ.మూడు నాలుగొందల వ్యత్యాసం ఉంటోంది. దీంతో ఇక్కడే వెండి ఖరీదు చేసుకుని వెళ్లే గోపీనాథ్‌... ఆభరణాలు, వస్తువులు తయారు చేసి మళ్లీ నగరానికే తీసుకువచ్చి విక్రయిస్తుంటారు.

సీసీ కెమెరాల ఫుటేజీ

సీసీ కెమెరాల ఫుటేజీ

దీనికోసం వారానికి ఓ రోజు హైదరాబాద్‌ రావడం పరిపాటి కావడంతో బస చేయడానికి సుభాష్‌రోడ్‌లో ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. కాగా, ఎప్పటిలానే సేలం నుంచి ప్రైవేట్‌ బస్సులో వచ్చిన గోపీనాథ్‌ బుధవారం ఉదయం 8.30 గంటలకు లక్డీకపూల్‌లో దిగాడు. రెండు బ్యాగులతో వచ్చిన ఆయన అక్కడ నుంచి ఆటోలో సుభాష్‌రోడ్‌కు చేరుకున్నాడు.

పారిపోతున్న నిందితుడు

పారిపోతున్న నిందితుడు

తాను నివసించే గది సమీపంలోనే బటర్‌ఫ్లై బేకరీ వద్ద ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోపీనాథ్‌ను ఆపి తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు.

పారిపోతున్న నిందితులు

పారిపోతున్న నిందితులు

మీ బ్యాగులో మాదకద్రవ్యమైన బ్రౌన్‌షుగర్‌ ఉన్నట్లు సమాచారం వచ్చిందంటూ బెదిరించారు. తనిఖీలు చేయాలంటూ బ్యాగు తెరిచి చూపించాలని ఆదేశించారు. దీంతో గోపీనాథ్‌ అలాగే చేశాడు.

బాధితుడి వెనకాలే నిందితులు

బాధితుడి వెనకాలే నిందితులు

ఒక దాంట్లో 25 కేజీల వెండి ఆభరణాలు, మరో బ్యాగ్‌లో రూ.20 లక్షల నగదు ఉన్నాయి. ఓ పక్క తనిఖీలు చేస్తున్నట్టు నటిస్తుస్తూనే.. అదును చూసుకుని బాధితుడి దృృష్టి మరల్చారు. వెంటనే బ్యాగ్‌లో ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.7.50 లక్షలు అపహరించారు. ఆ తర్వాత గోపీనాథ్‌ను అక్కడ్నుంచి పంపేశారు.

నిందితుడు

నిందితుడు

తన గదికి వెళ్ళాక నగదు మాయమైన విషయం గుర్తించిన బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ దర్యాప్తు చేపట్టారు.

నిందితుడు

నిందితుడు

ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న మహంకాళి పోలీసులు.. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు.
ఈ నేపథ్యంలోనే సైకిళ్లపై వస్తున్న ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు 50 ఏళ్లు, మరొకరు 40 ఏళ్ల వయస్కులని పోలీసులు అంచనా వేశారు.

నిందితుడు

నిందితుడు

వీరు ఎక్కువ దూరం నుంచి సైకిల్‌ పైన రాలేరని, ఆ సమీపంలోనే వీరు ఆశ్రయం పొందిఉంటారని భావిస్తున్నారు. అంతేగాక, ఈ నేరం ఉదయం జరగడం, అప్పుడే గోపీనాథ్‌కు సేలం నుంచి రావడంతో ఆయనకు తెలిసిన వారి ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఒక దాంట్లో 25 కేజీల వెండి ఆభరణాలు, మరో బ్యాగ్‌లో రూ.20 లక్షల నగదు ఉన్నాయి. ఓ పక్క తనిఖీలు చేస్తున్నట్టు నటిస్తుస్తూనే.. అదును చూసుకుని బాధితుడి దృృష్టి మరల్చారు. వెంటనే బ్యాగ్‌లో ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.7.50 లక్షలు అపహరించారు. ఆ తర్వాత గోపీనాథ్‌ను అక్కడ్నుంచి పంపేశారు.

తన గదికి వెళ్ళాక నగదు మాయమైన విషయం గుర్తించిన బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న మహంకాళి పోలీసులు.. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు.

ఈ నేపథ్యంలోనే సైకిళ్లపై వస్తున్న ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు 50 ఏళ్లు, మరొకరు 40 ఏళ్ల వయస్కులని పోలీసులు అంచనా వేశారు. వీరు ఎక్కువ దూరం నుంచి సైకిల్‌ పైన రాలేరని, ఆ సమీపంలోనే వీరు ఆశ్రయం పొందిఉంటారని భావిస్తున్నారు. అంతేగాక, ఈ నేరం ఉదయం జరగడం, అప్పుడే గోపీనాథ్‌కు సేలం నుంచి రావడంతో ఆయనకు తెలిసిన వారి ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two fake police theft Rs. 7.50lakhs from a Merchant in Secunderabad on Wednesday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి