విద్యుత్ షాక్ తో పొలంలో ఇద్దరు రైతులు మృతి .. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం శివారు ప్రాంతమైన భోజ్యా తండాలో విద్యుదాఘాతానికి ఇద్దరు రైతులు బలైన సంఘటన చోటు చేసుకుంది. పొలంలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళిన రైతులు వ్యవసాయ మోటార్ స్టార్టర్ కు ఫీజులు వేస్తున్న క్రమంలో, బోరుకు ఆనుకొని ఉన్న జె వైర్ కు విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో ఒకరు 28 సంవత్సరాల భూక్య సుధాకర్ కాగా, మరొకరు 40 సంవత్సరాల వయసున్న మాలోత్ యాకూబ్ గా తెలుస్తుంది. పంట పొలంలో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన ఇద్దరు రైతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు రైతుల మృతితో కంటికి కడివెడు శోకిస్తున్నారు. కుటుంబ పెద్దను పోగొట్టుకున్న శోకంలో రెండు కుటుంబాలు ఉన్నాయి. ఇక ఈ ఘటనపై తెలంగాణ మంత్రి స్పందించారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని భోజ్యా తండాలో పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తున్న సందర్భంలో కరెంట్ షాక్ తగిలి మృతిచెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన నియోజకవర్గంలో రైతుల మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications