యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండంతస్తుల భవనం: నలుగురు మృతి, శిథిలాల కింద పలువురు
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ రెండతస్తుల భవనం కుప్పకూలింది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న శ్రీరాంనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం.
కూలిన భవనంలో ముందు భాగంలో రెండు దుకాణాలు నిర్వహిస్తుండగా, వెనుక భాగంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రమాద సమయంలో ఇళ్లలో, దుకాణాల్లో ఉన్నవారితోపాటు అక్కడికి వచ్చిన పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కాగా కూలిన రెండతస్తుల భవనాన్ని.. 35 ఏళ్ల క్రితం కట్టారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మృతులు యాదగిరిగుట్టకు చెందిన దశరథ్ గౌడ్, శ్రీను, ఉపేందర్, శ్రీనాథ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications