రెండువర్గాల మధ్య ఘర్షణ, పోలీస్ స్టేషన్ పై దాడి, ఉట్నూర్ లో ఉద్రిక్తత

ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ లో రెండు వర్గాల మద్య ఘర్షణ పోలీస్ స్టేషన్ పై దాడికి కారణమైంది. ఈ ఘటనలో ఎఎస్పీ, డిఎస్పీలకు గాయాలయ్యాయి.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ లో రెండు వర్గాల మద్య ఘర్షణ పోలీస్ స్టేషన్ పై దాడికి కారణమైంది. ఈ ఘటనలో ఎఎస్పీ, డిఎస్పీలకు గాయాలయ్యాయి. పరిస్థితిని పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

శనివారం నాడు ఓ వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చిన ఆడియో ఘటనపై రెండు వర్గాలు ఒకరిపై మరోకరు దాడికి దిగాయి.

ఉద్దేశ్యపూర్వకంగా తమ వర్గాన్ని కించపరిచేలా చేసిన పోస్టుపై మరో వర్గానికి చెందినవారు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అయినా పోలీసులనుండి సరైన స్పందన లేకపోవడంతో ఆదివారం ఉదయమే పోలీస్ స్టేషన్ పై ఒకవర్గం వారు రాళ్ళదాడికి దిగారు.

Two groups attack each and other in Utnoor at Adilabad district

ఈ ఘటనతో పోలీసులు గాయపడ్డారు.ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఉట్నూర్ కు పోలీస్ బలగాలను రప్పించారు.మరో వైపు రెండు వర్గాలు ఒకరిపై మరోకరు రాళ్ళదాడికి దిగారు.

ఈ దాడులను అదుపుచసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. రాళ్ళదాడిలో ఎస్పీ, ఎఎస్పీ, డిఎస్పీలకు గాయాలయ్యాయి.

విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ , ఐజీ వర్మలు ఉట్నూర్ కు చేరుకొన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇరువర్గాలతో డిఐజీ రవివర్మ చర్చిస్తున్నారు. అయితే తప్పు చేసిన వారిని వదిలపెట్టే ప్రసక్తేలేదని రవివర్మ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+