Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీ సర్కార్ లో ఇద్దరు మంత్రులు ఔట్.!ఇద్దరు కొత్తవాళ్లు ఇన్.!సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం?

హైదరాబాద్ : తెలంగాణ క్యాబినెట్ లో స్వల్ప మార్పులు చోటుచేసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొంతమంది మంత్రుల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదరణ కన్నా వివాదాలలో ప్రభుత్వం చిక్కుకుంటోందన్నా భావన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావులో కలిగినట్టు తెలుస్తోంది. పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ నష్టం కలిగించే మంత్రుల మీద వేటు వేసేందుకు సీఎం కసకత్తులు చేసినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు గానీ, మంత్రులు గానీ అధికారం ఉంది కదా అని ప్రభుత్వానికి తలవంపులు తీసెకొచ్చే ప్రయత్నాలు చేస్తే క్షమించే ప్రసక్తే లేదనే సంకేతాలివ్వబోతున్నారు సీఎం. అందుకు సంక్రాంతి తర్వాత ఊహించని నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.

 సీఎం తన సన్నిహితులతో గోప్యంగా కార్యాచరణ.. ఆ ఇద్దరు మంత్రులపై తప్పని వేటు

సీఎం తన సన్నిహితులతో గోప్యంగా కార్యాచరణ.. ఆ ఇద్దరు మంత్రులపై తప్పని వేటు

ఇచ్చిన స్వేచ్చను దుర్వినియోగం చేసినా, మంచితనాన్ని బలహీనతగా పరిగణించినా తర్వాత పర్యవసానాలు దారుణంగా రూపాంతరం చెందుతాయని చరిత్ర ఎన్నో సందర్బాల్లో నిరూపించింది. అధికారం ఉంది కదా అని అహంకారం ప్రదర్శిస్తే తగు మూల్యం చెల్లించకతప్పదనే హెచ్చరికలు కూడా ప్రగతి భవన్ నుండి వెలుపడబోతున్నాయి. ఇందుకోసం సీఎం చంద్రశేఖర్ రావు తన సన్నిహితులతో అత్యంత గోప్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు విశ్వనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

 సీఎం సహనానికి పరీక్ష పెట్టిన మంత్రులు.. ఫలితం తప్పదంటున్న సీఎంవో సిబ్బంది

సీఎం సహనానికి పరీక్ష పెట్టిన మంత్రులు.. ఫలితం తప్పదంటున్న సీఎంవో సిబ్బంది

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు మంత్రులతో గానీ, ఉన్నతాదికారులతో గానీ ఇతర సహచరులతో గానీ దాదాపు స్నేహపూర్వంగా వ్యవహరించే తత్వం కలిగి ఉంటారు. ఎవ్వరిని కూడా పెద్దగా దూషించే స్వభావం కాదు. ఎంత తప్పు చేసిన చిన్న చిన్న హెచ్చరికలతో సరి పెడతారు గానీ, ముఖ్యమంత్రి హోదాలో చర్యలు తీసుకునేంతవరకూ పరిస్ధితిని సాగదియ్యరు. కొన్ని కొన్ని సందర్బాల్లో మాత్రం ఎంతటి వారైనా శిక్షించడానికి వెనకాడేది లేదని స్నపష్టమైన సంకేతాలు ఇస్తారు. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, మరో మంత్రి ఈటల రాజేందర్ పైన వేసిన వేటు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

 మంత్రుల పనితీరు బాగాలేదు.. పలు హెచ్చరికలు జారీ చేసి సీఎం

మంత్రుల పనితీరు బాగాలేదు.. పలు హెచ్చరికలు జారీ చేసి సీఎం

తాజగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో కొంత మంది మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలని, వివాదాల జోలికి వెళ్లకుండా క్షేత్రస్దాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని గతంలో ఎన్నో సందర్బాల్లో సూచించిన దఖలాలు ఉన్నాయి. ఇక మంత్రుల పనితీరు పట్ల గానీ, అనుచిత వ్యాఖ్యల పట్ల గానీ సీఎం చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఇటీవల సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు ఫాంహౌస్ వ్యవహారంలో కూడా సీఎం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. బేరసారాల ఎపిసోడ్ వల్ల పార్టీకి ఒరిగే ప్రరయోజనం కన్నా రెట్టింపు స్థాయిలో నష్టం కలుగుతుందన్న తుది నిర్ణయానికి సీఎం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ అంశం పట్ల కూడా సీఎం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

 ఇద్దరు మంత్రులకు ఉద్వాసన.. ఇద్దరు కొత్తవాళ్లకు ఛాన్స్..?

ఇద్దరు మంత్రులకు ఉద్వాసన.. ఇద్దరు కొత్తవాళ్లకు ఛాన్స్..?

ప్రస్తుతానికి తెలంగాణలో కొంత మంది ఎమ్మెల్యేల పనితీరుతో పాటు మరికొంత మంది మంత్రుల వ్యవహారం ఏమాత్రం బాగాలేదని ప్రగతి భవన్ కు నివేదిక అందినట్టు తెలుస్తోంది. ఈ నివేదికను లోతుగా పరిశీలించిన సీఎం చంద్రశేఖర్ రావు ఇద్దరు మంత్రులపైన కఠిన నిర్ణయం తీసుకనేందుకు కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. కార్మిక శాఖా మంత్రి చామకుర్తి మల్లారెడ్డి, పౌరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలాకర్ పై సీఎం వేటు వేయబోతున్నట్టు తెలుస్తోంది. వారి స్దానాల్లో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే బాల్క సుమన్ లను క్యాబినెట్ లోకి తీసుకొనేందుకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ప్రారంభం కానున్న కొత్త సచివాలయంలోకి స్వల్ప మార్పులు చేయబోయే టీం తో ఎంట్రీ ఇవ్వాలని చంద్రశేఖర్ రావు యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+